సాయి పల్లవి, నాగ చైతన్యల ‘లవ్ స్టోరీ’.. ఆసక్తి రేపుతున్న కొత్త పోస్టర్
శేఖర్ కమ్ముల చిత్రాలకు టాలీవుడ్‌లో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. హ్యాపీడేస్, గోదావరి, ఆనంద్ ఇలాంటి ఓ ఆహ్లాదకరమైన, మంచి అనుభూతినిచ్చే చిత్రాలను తెరకెక్కించడంతో శేఖర్ కమ్ముల దిట్టా. ఆయన దర్శకత్వం ఆ మధ్య వచ్చిన ఫిదా ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఈ సినిమాతో సాయి పల్లవికి ఏ రేంజ్ పాపులార్టీ వచ్చిందో అందరికీ తెలిసిందే.
అయితే వీరి కాంబినేషన్‌లో ఫిదా ఎంతటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో.. మరోసారి ప్రేక్షకులకు అదే మ్యాజిక్‌ను చూపించేందుకు నాగ చైతన్యను వెంటబెట్టుకుని వచ్చేందుకు సిద్దమవుతున్నారు. శేఖర్ కమ్ముల, సాయి పల్లవి, నాగ చైతన్య కాంబినేషన్‌లో రాబోతోన్న మూవీపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. నాగ చైతన్య ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

తాజాగా సంక్రాంతి కానుకగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు. వీరిద్దరి మధ్య జరిగే ప్రేమకథను లవ్ స్టోరీ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలోని ఫీల్‌ను తెలియజెప్పేందుకు ఇంతకంటే గొప్ప టైటిల్ ఏది లేదని నాగ చైతన్య ట్వీట్ చేశాడు. ఏసియన్ అధినేత సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవిలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











