సమంత -నాగ చైతన్య సీక్రెట్ ప్లాన్.. ఇద్దరూ కలిసి అక్కడికి జంప్.. బీచ్ ఒడ్డున!
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ జోడీ సమంత -నాగ చైతన్య ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ సమయం దొరికినప్పుడల్లా అలా అలా షికారు చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలాగే ఓ సీక్రెట్ టూర్ ప్లాన్ చేశారట సామ్ దంపతులు. ఈ మేరకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న ఈ జంట ఇక ఫుల్లుగా ఎంజాయ్ చేయనుందట. ఇంతకీ చైతు సామ్ జోడీ ఎక్కడికి వెళ్లినట్లు? అది ఎందుకోసం? వివరాల్లోకి పోతే..

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. యువ జంట షికారు
న్యూ ఇయర్ సందర్బంగా ఎవరికి తోచిన ప్లాన్స్ వారు వేసుకుంటూ ఎంజాయ్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు అయితే ఫారెన్ టూర్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే మహేష్ బాబు, రాజశేఖర్ కూతుళ్లు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే బాటలో చై సామ్ యువ జంట షికారుకు బయల్దేరింది.

సీక్రెట్ ప్లాన్.. సూపర్ టూర్
కొత్త సంవత్సర వేడుకల కోసం సెలబ్రిటీలు అందరూ విదేశాలకు పయనమవుతుంటే, చై సామ్ జోడీ మాత్రం దేశంలోని సుందరమైన ప్రదేశం గోవాను వారి న్యూ ఇయర్ స్పాట్‌గా ఎంచుకుంది. ఈ మేరకు స్నేహితులతో కలిసి చైసాం ఇద్దరూ ఎంచక్కా ఓ టూర్ వేషాశారు.

ఇప్పటికే అక్కడ వాలిపోయారు
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరానికి వెల్‌కం చెప్పనున్న సందర్బంగా ఇప్పటికే అక్కడ వాలిపోయిందట చై సామ్ జోడీ. ఇప్పటి నుంచి జనవరి మొదటి వారం పూర్తయ్యేదాకా ఈ ఇద్దరూ అక్కడే ఎంజాయ్ చేయనున్నారని తెలుస్తోంది. 2017 సంవత్సరంలో ఈ ఇద్దరూ గోవాలో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఈ న్యూ ఇయర్ లో గోవాలో సందడి చేయాలని ఫిక్స్ అయ్యారట.

రొమాంటిక్ మూడ్.. కిక్కిచ్చే పిక్స్
చై సామ్ జోడీకి టూర్స్ వేయడం, అక్కడ రొమాంటిక్‌గా ఫోజులిస్తూ ఫోటోలు దిగడం సాధారణమైన విషయమే. పైగా ఆ ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో పెట్టి ఫ్యాన్స్ చేత సూపర్ అనిపించుకుంటుంది కూడా. సో ఈ లెక్కన ఈ కొత్త సంవత్సరం మొదట్లో ఈ జోడీ రొమాంటిక్ పిక్స్ మరోసారి సెన్సేషన్ కానున్నాయన్నమాట.

చైసామ్ సినీ జర్నీ
ఇక వీరిద్దరి సినిమాల విషయానికొస్తే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీలో నాగచైతన్య నటిస్తున్నాడు. ఈ సినిమాలో చైతు సరసన సాయి పల్లవి నటిస్తోంది. ఇక సమంత.. ముంబైలో ది ఫ్యామిలీ మేన్స్ సీజన్ 2 షూటింగ్‌లో పాల్గొంటోంది.


Click it and Unblock the Notifications











