సమంత కోసం దర్శకుడి కండిషన్.. కన్ఫ్యూజన్‌లో నాగ చైతన్య?
టాలీవుడ్ బెస్ట్ స్టార్ కపుల్స్ గా కొనసాగుతున్న నాగ చైతన్య - సమంత మజిలీ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే మరోసారి కూడా వారిద్దరు నటించబోతున్నారు అంటూ గత కొంత కాలంగా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి. అయితే నాగ చైతన్యతో నటిస్తే.. మినిమామ్ హిట్టయ్యేలా ఉండాలని సరైన కథల కోసం సమంత ఎదురుచూస్తోంది.
కథలు చాలానే వస్తున్నాయట. నాగ చైతన్య ఒప్పుకుంటున్నప్పటికి సమంత మాత్రం ఒప్పుకోవడం లేదట. తనకు ఏ మాత్రం అనుమానం ఉండకుండా సినిమా కథ కాన్ఫిడెన్స్ ఇవ్వాలని దర్శకులకు చెబుతోందట. ఇకపోతే ఇటీవల దర్శకుడు విక్రమ్ కె కుమార్ నాగ చైతన్యతో చేయబోతున్న సినిమా కోసం సమంతను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల లిస్ట్ ఎక్కువగా ఉండడంతో డేట్స్ సెట్టవుతాయో లేదో తనకు తెలియదని సమంత వివరణ ఇచ్చిందట.

దీంతో నాగ చైతన్య మరో హీరోయిన్ ని చూద్దామని విక్రమ్ కి చెప్పగా ఆయన సమంత అయితేనే బావుంటుందని ఒక కండిషన్ పెట్టారట. దీంతో నాగ చైతన్య కాస్త కన్ఫ్యూజన్ లో పడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే కరోనా తగ్గిన తరువాత వీలైనంత త్వరగా మరో సినిమాను పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. కానీ సమంత వేరే సినిమాలతో బిజీగా ఉంటే.. షూటింగ్ పూర్తవ్వడానికి ఆలస్యం అవుతుంది. అందుకే నాగ చైతన్య కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











