Samanttha: సమంత జ్ఞాపకాలు అలా తుడిచేసిన చైతు.. శోభితతో ఎంగేజ్ మెంట్ కు ముందు ఏం చేశాడంటే?
ప్రస్తుతం తెలుగు ఆడియెన్స్ ఓ రేంజ్ లో మాట్లాడుకుంటున్న అంశం ఏదన్నా ఉంది అంటే అది అక్కినేని యువ హీరో అక్కినేని నాగ చైతన్య అలాగే ప్రముఖ నటి శోభిత ధూళిపాళ వివాహం కోసమే అని చెప్పాలి. కాగా ఈ ఇద్దరు ఎప్పుడు నుంచో రిలేషన్ లో ఉండగా ఇప్పుడు పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్నారని కన్ఫర్మ్ అయ్యింది. మరి ధూళిపాళ ఇంటిపేరు నుంచి ఇప్పుడు అక్కినేని ఇంటి పేరుకి ఈ యువ నటి మారుతూ ఉండగా ఈ ఇద్దరి ఎంగేజ్మెంట్ తోనే ఒక రేంజ్ లో నెటిజన్స్ నడుమ రచ్చ రచ్చ నడుస్తుంది.
అయితే వీరితో పాటుగా నాగ చైతన్య మాజీ భార్య సమంత కోసం కూడా చాలా కామెంట్స్ మొదలయ్యాయి. అయితే చైతు సమంతలు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్నేళ్ల లోనే వారిద్దరూ విడిపోయారు. కాగా ఆ తర్వాత సమంత తన ప్రవర్తన మార్చడం తన సోషల్ మీడియాలో చైతుతో కలిసి ఉన్న ఫోటోలు పోస్ట్ లు అన్నీ డిలీట్ చేయడం జరిగింది.

కానీ ఆ తర్వాత కూడా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా నాగ చైతన్య మాత్రం ఎలాంటి పోస్ట్ లని డిలీట్ చేయలేదు. కానీ ఇప్పుడు వరకు డిలీట్ చేయని తాను ఇలా శోభితతో ఎంగేజ్మెంట్ ని అనౌన్స్ చేసిన తర్వాతే తన ఇన్స్టాగ్రాంలో ఉన్నటువంటి సామ్ జ్ఞాపకాలు అన్నిటిని కూడా తాను తుడిచేసాడు. తనతో ఒక్క ఫోటో కానీ తనకి సంబంధించిన ఒక్క పోస్ట్ కానీ నాగ చైతన్య మిగల్చలేదు.
దీనితో ఇన్ని రోజులు ఆమె జ్ఞాపకాలు తనతో ఉంచుకొని ఇప్పుడే తీసివేయడం ఏంటో అని అందరిలో హాట్ టాపిక్ గా మారింది. చైతూ నుంచి సమంత వేరు అయ్యిన తర్వాత వెంటనే అన్నిటిని తీసింది ఒక్క తన పెళ్లి బట్టలు మాత్రమే ఉంచుకొని అది కూడా ఈ మధ్యనే అప్డేట్ చేయించింది.

కానీ చైతు మాత్రం ఇన్నాళ్లు వెయిట్ చేసి సరిగ్గా సమంత లవ్ ప్రపోజ్ చేసిన రోజునే తన కొత్త రిలేషన్ షిప్ ని అనౌన్స్ చేయడం పైగా ఈ తర్వాతే సమంతకి సంబంధం ఉన్న పోస్ట్ లు తొలగించడం అనేది మరిన్ని ప్రశ్నలు రేపుతోంది. దీనితో ఇదంతా చైతు కావాలనే చేస్తున్నాడా అన్నట్టు కూడా చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు సమంతపై చాలా మందిలో సాఫ్ట్ కార్నర్ కూడా మొదలయ్యింది.
కాగా ప్రస్తుతం నాగ చైతన్య తన కెరీర్ లో భారీ చిత్రం "తండేల్" చేస్తుండగా ఇది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతుంది అలాగే దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. ఇక దీనితో పాటుగా సమంత అయితే ఒక్క సినిమా మాత్రమే కాకుండా పాన్ లెవెల్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇక శోభిత కూడా దాదాపు సామ్ తరహాలోనే ఈమె కూడా పలు చిత్రాలు చేయడమే కాకుండా తాను హిందీ తెలుగు, తమిళ్ సహా ఇంగ్లీష్ లో కూడా నటించింది. ఇలా ముగ్గురూ సినిమా పరంగా మాత్రం ఎవరికీ ఎవరూ తీసిపోరు..


Click it and Unblock the Notifications











