twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని ఫ్యాన్స్‌కు ట్రీట్.. వెంకీమామ నుంచి ఫస్ట్ గ్లింప్స్

    |

    తమ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఏదైనా ట్రీట్ ఇవ్వాలని హీరోలంతా అనుకంటూ ఉంటారు. తమ కొత్త ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ప్రకటనలు, కొత్త పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ఇలా ఏదో ఒకటి రిలీజ్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నేడు అక్కినేని నాగ చైతన్య పుట్టినరోజు. ఈ సందర్బంగా అక్కినేని ఫ్యాన్స్‌కు ట్రీట్ మీద ట్రీట్ ఇస్తున్నాడు హీరో. ఇప్పటికే శేఖర్ కమ్ముల మూవీ నుంచి తన ప్రపంచాన్ని పరిచయం చేయగా.. వెంకీ మామ నుంచి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించేశాడు.

     సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్..

    సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విషెస్..

    నాగ చైతన్య పుట్టిన రోజు సందర్బంగా అభిమానులే కాక పలువురు సెలబ్రెటీలు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రకుల్ ప్రీత్, కాజల్ అగర్వాల్, హన్సిక, లావణ్య త్రిపాఠి, నమ్రతా శిరోద్కర్ లాంటి ప్రముఖులు చైతన్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపగా.. అందరిలోకెల్లా సమంత చేసిన పోస్ట్ వైరల్ కాసాగింది.

     చైతు ప్రపంచం అదే..

    చైతు ప్రపంచం అదే..

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య నటిస్తోన్న సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నాగ చైతన్య మరింత రా లుక్‌లో కనిపిస్తున్నాడు. సాధారణ కుటుంబంలోని కుర్రాడిలా ఇంట్లో చీపురు పట్టుకుని ఊడుస్తున్నాడు. బీరువాలో ఉన్న డబ్బులు లెక్కపెట్టుకుంటున్నాడు. పిల్లలతో ఆడుకుంటూ సంతోషంగా ఉన్నట్లు, ఏదో తెలియని గతం కూడా ఉన్నట్లు, దాన్ని తలుచుకుని బాధపడుతున్నట్లు ఇలా అతనికి సంబంధించిన భావోద్వేగాలన్నింటిని చూపించాడు.

    మరోసారి రా లుక్..

    మజిలీ చిత్రంలో రా లుక్‌లో కనిపించిన చైతు.. మరోసారి శేఖర్ కమ్ముల చిత్రం కోసం రా లుక్ మెయింటెన్ చేస్తున్నాడు. ఈ చిత్రంలో పూర్తి భావోద్వేగాలతో కూడిన పాత్రను పోషింస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ చిత్రం కూడా మజిలీలా గుర్తుండిపోయే సినిమా అవుతుందో లేదో చూడాలి.

    వెంకీ మామ నుంచి ఫస్ట్ గ్లింప్స్..

    వెంకీ మామ నుంచి ఫస్ట్ గ్లింప్స్..

    రియల్ లైఫ్‌లో మామఅల్లుడైన వెంకటేష్, నాగ చైతన్య కలిసి వెంకీమామ అనే చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం నుంచి కెప్టెన్ కార్తీక్ శివరామ్ అంటూ నాగ చైతన్య పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఈ మూవీలో మామతో కలిసి కామెడీ చేస్తూనే సరిహద్దుల్లో శత్రువులతో పోరాడబోతోన్నాడు కెప్టెన్ కార్తీక్. చైతూ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

    Recommended Video

    #CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
     డిఫరెంట్ పాత్రల్లో చైతు..

    డిఫరెంట్ పాత్రల్లో చైతు..

    శేఖర్ కమ్ముల చిత్రంలో నాగ చైతన్య పూర్తి భిన్నమైన పాత్రలో నటించగా.. వెంకీమామ సినిమాలోనూ రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనబడబోతోన్నాడు. ఒకేరోజు ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కిన రెండు చిత్రాలకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌లు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. తమ హీరోకు మంచి దశ మొదలైందని.. ఇక వరుసగా విజయాలే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    English summary
    Naga Chaitanya First Glimpse from venky Mama And Naga Chaitanya Shekar Kammula Movie The World of #NC19 Released. This Movie Is A Multi Starer With Venkatesh ALong With raashi Khanna And Payal Rajput.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X