శోభితాను నాగచైతన్య ఎలా ప్రేమలో పడేశారో తెలుసా? ఒకే ఒక్క మెసేజ్

నాగచైతన్య రీసెంట్ గా 'తండేల్'తో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. తన కెరీయర్ లో ఫస్ట్ రూ.100 కోట్ల సినిమాను సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్నారు. ఇదే ఊపులో నెక్ట్స్ ప్రాజెక్ట్ ను గ్రాండ్ గా ప్లాన్ గా చేస్తున్నారు నాగచైతన్య. అయితే ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. శోభితా ధూళిపాలను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో విడాకులు తీసుకున్న తర్వాత మూడేళ్లకు సెకండ్ మ్యారేజ్ చేసుకుని లైఫ్ ను సాగిస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

మరోవైపు నాగచైతన్య - శోభితా స్టార్ కపుల్ గా ఇంటర్నేషనల్ బ్రాండ్ వోగ్ ను ప్రమోట్ చేస్తూ కమర్షియల్ యాడ్ లో నటించారు. స్టైలిష్ లుక్ లో ఇద్దరూ తమ అభిమానులను ఫిదా చేశారు. ట్రెండీ వేర్స్ లో ఈ న్యూల్లీ మ్యారీడ్ కపుల్స్ అందరి దృష్టిని ఆకర్షించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నాగచైతన్య - శోభితాల ఇంట్రెస్టింగ్ బ్యూటీఫుల్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది.

Naga Chaitanya Impressed Sobhita Dhulipala in their first meet

అయితే, గతంలో నాగచైతన్య శోభితా ధూళిపాలతో కలిసి డేటింగ్ లో ఉన్నారంటూ తెగ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వారు లండన్ లోనూ కలిసి డిన్నర్ చేసిన ఫొటోలు కూడా లీక్ అయ్యాయి. అందరూ ఊహించినట్టుగానే, రూమర్లు పుట్టుకొచ్చినట్టుగానే ఇద్దరూ తమ రిలేషన్ షిప్ ను కన్ఫమ్ చేశారు. 2024 ఆగస్టు 8న నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత 2024 డిసెంబర్ 4న అతి కొద్ది సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు.

ఇదిలా ఉంటే.. చైతన్య ఫస్ట్ శోభితాను ఎలా కలిశారనేది, ఎలా వీరిద్దరూ ప్రేమలో పడ్డారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమ ఫస్ట్ మీట్ పై శోభితా రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. చైతన్యనే మొదట తనను ఇన్ స్టా గ్రామ్ లో ఫాలో అయ్యాడని చెప్పింది. చైతూ అప్పటికీ కేవలం 70 మందిని మాత్రమే ఫాలో అవుతూ ఉండేవారని, అందులో తను కూడా ఉన్నానని చెప్పింది. ఇక చైతూ ఫాలో అవుతున్నాడని తెలిసి వెంటనే ఫ్యాలో బ్యాక్ చేశానని వివరింది.

ఆ వెంటనే చైతూ నుంచి మెసేజ్ వచ్చిందని చెప్పింది. ఆ మేజెస్ చూసి తనుకూడా రిప్లై ఇచ్చిందంటా అలా వరుసగా మెసేజ్ లు చేసుకుంటూనే ఉన్నారంట. ఆ కన్వర్జేషన్ కొనసాగుతుండగానే నాగచైతన్య ముంబైకి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారని తెలిపింది. రాగానే బ్రేక్ ఫాస్ట్ డేట్ కి తీసుకెళ్లారని శోభితా తెలియజేసింది. అలా తమ ప్రేమకు మొదటి అడుగుపడిందని శోభితా వెల్లడింది.

ఇక శోభితా ధూళిపాలను నాగచైతన్య మొదటిసారిగా ముంబైలో కలిశారు. అది కూడా తన ఓటీటీ ఫిల్మ్ 'ధూత' రిలీజ్ ఈవెంట్ లో ఫస్ట్ టైమ్ కలిశారంట. అక్కడి నుంచి ఇలా వారి ప్రయాణం మొదలైందంట. ఇక బ్రేక్ ఫాస్ట్ డేట్ తర్వాత నాగచైతన్యనే శోభితాను పెళ్లి చేసుకుందామని కూడా అడిగారంట. అలా ఇప్పుడు వారిద్దరూ ముళ్ల బంధంతో ఒక్కటై హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X