నాగ చైతన్యతో బాలీవుడ్ లేడీ డైరెక్టర్ సెల్ఫీ .. మీ నాన్నతో అలాంటి రిలేషన్ అంటూ కామెంట్
బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నారనే వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో అక్కినేని నట వారసుడు నాగ చైతన్య మరోసారి వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ మహిళా డైరెక్టర్, కోరియోగ్రాఫర్‌తో సెల్ఫీ ఫోటో ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశమైంది. నాగచైత్యనతో కూడిన ఫోటోను డైరెక్టర్ ఫరా ఖాన్ పోస్టు చేసి ఆసక్తికరమైన మెసేజ్‌ను పోస్టు చేశారు.
25 ఏళ్ల క్రితం నాగ చైతన్య నాన్న నాగార్జున అక్కినేనితో కలిసి పనిచేశాను. నాగ్ నటించిన ఓ పాటకు డ్యాన్స్ కంపోజ్ చేసిన తర్వాత ఆయనతో జీవితకాలం బంధం ఏర్పడింది. ఆయనతో స్నేహం ఇప్పటికీ కొనసాగుతున్నది. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఆయన వారసుడు నాగచైతన్యను ఓ వ్యాపార ప్రకటన కోసం డైరెక్ట్ చేసే అవకాశం లభించింది. అలాగే నాగ చైతన్య స్పందిస్తూ.. ఫరా ఖాన్‌తో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆమె టీమ్‌తో పనిచేయడం గొప్ప అనుభూతిని కలిగించింది అని అన్నారు.

ఇక నాగచైతన్య నటించిన లవ్‌స్టోరి రిలీజ్‌కు సిద్దంగా ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవికి జంటగా నటించిన విషయం తెలిసిందే. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించే థాంక్యూ సినిమాలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ దర్శకత్వం వహించే లాల్ సింగ్ చద్దా చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారనే విషయం వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











