సినీ వర్కర్స్ కోసం యువహీరోలు నాగ చైతన్య, కార్తికేయ విరాళం
కరోనా ను నియంత్రించడానికి పాటిస్తున్న 21 రోజుల లాక్‌డౌన్‌తో సినీ పరిశ్రమ స్తంభించింది. దాంతో షూటింగులు లేక ఇబ్బంది పడుతున్న పేద సినీ కార్మికుల కోసం సినీ పరిశ్రమ ఏర్పాటు చేసిన కరోనా క్రైసిస్ ఛారిటీకి యువ హీరోలు నాగ చైతన్య 25 లక్షల రూపాయలు, కార్తీకేయ రూ.2 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

మనకి రోజూ తోడుండే రోజువారీ సినీ వర్కర్స్ కి సహాయం చేయడం కోసం పరిశ్రమ పూనుకోవడం తనని కదిలించిందని, తన వంతుగా వారికి 25 లక్షల రూపాయల సహాయం అందిస్తున్నట్టు, ఇలాంటి సమయంలో అందరం కలిసికట్టుగా ఈ పరిస్థితిని ఎదుర్కోవాలని నాగ చైతన్య అన్నారు.

సినీ కార్మికుల పరిస్థితిపై కార్తీకేయ గుమ్మంకొండ ట్విట్టర్‌లో స్పందిస్తూ.. సెట్స్‌లో చాలా కష్టపడే రోజు వారీ మూవీ వర్కర్స్ ఇబ్బందుల్లో కూరుకుపోయారు. ఈ కష్టకాలంలో వారిని ఆదుకొనే బాధ్యత, అండగా నిలువాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది. వారిని ఆదుకొనేందుకు నా వంతుగా రూ.20 లక్షలను విరాళంగా ఇస్తున్నాను అని కార్తీకేయ తెలిపారు.
పేద సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సిసిసి (కరోనా క్రైసిస్ ఛారిటీ) అనే నిధికి లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. "చిత్ర పరిశ్రమలో భాగంగా, చలనచిత్ర సోదరభావం ప్రారంభించిన కరోనా క్రైసిస్ చారిటీ (సిసిసి) ద్వారా రోజువారీ వేతనాలపై పనిచేసే ప్రజలకు నా మద్దతును అందించాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి 1 లక్ష రూపాయలు విరాళంగా ఇవ్వడం ద్వారా నా వంతు కృషి చేస్తున్నాను" అని ఆమె చెప్పారు.
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబుతోపాటు పలువురు హీరోలు విరాళాలను ప్రకటించి తమ వంతుగా అండగా నిలిచిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











