Naga Chaitanya Custody trailer: రౌడీని కాపాడాలనుకునే పోలీస్ స్టొరీ… బిగ్ యాక్షన్ డోస్
అక్కినేని హీరో నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన మూవీ కస్టడీ. ఈ మూవీ మే 12న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. తెలుగు, తమిళ్ భాషలలో తెరకెక్కిన ఈ సినిమాపై చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఇక ట్రైలర్ చాలా ఇంటెన్సివ్ గా డిజైన్ చేయడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే..
కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య: సాధారణ కానిస్టేబుల్ అయిన నాగ చైతన్య చట్టంలో ఉన్న రూల్స్ ప్రకారం డ్యూటీ చేయాలని అనుకుంటారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి (ప్రియమణి) సెక్యూరిటీగా వెళ్లి ఆమె వెహికల్ ని అడ్డుకొని చివాట్లు తింటాడు. ఈ సీన్ తో ట్రైలర్ ని ఎలివేట్ చేశారు. తరువాత కృతి శెట్టి, చైతూ లవ్ స్టొరీ షాట్స్ పై ఫోకస్ చేశారు. ఇక మూవీలో చైతూ పేరు శివ కాగా, హీరోయిన్ పేరు రేవతిగా ఉంది. తనని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలని హీరోయిన్ చైతూని అడుగుతుంది.

అతనిని కాపాడటం కోసం: క్రిమినల్ రాజుగా అరవింద్ స్వామి క్యారెక్టర్ ని ట్రైలర్ లో ఎలివేట్ చేశారు. అతనిని కాపాడటం కోసం మరో అధికారిని చైతన్య జైల్లో పెడతాడు. సఖినేటిపల్లి పీఎస్ లో ఉన్న క్రిమినల్ తప్పించుకున్నాడు అని డైలాగ్స్ తో అరవింద్ స్వామి జైలు నుంచి తప్పించుకున్నట్లు ట్రైలర్ ని నడిపించారు. ఇక కానిస్టేబుల్ శివ క్రిమినల్ అయిన అరవింద్ స్వామిని పోలీసుల ఎన్ కౌంటర్ నుంచి తప్పించి కోర్టులో హాజరుపరచాలని అనుకుంటాడు.

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ ..: దానికోసం సిస్టమ్ తోనే ఫైట్ చేస్తాడు. ఒక సారి న్యాయం పక్కన నిలబడి చూడు లైఫే మారిపోతుంది అనే డైలాగ్స్ తో ట్రైలర్ ని ఎండ్ చేశారు. ఇందులో సీబీఐ ఆఫీసర్ గా శరత్ కుమార్ కనిపిస్తున్నారు. ఆనంది కూడా సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తూ ఉండటం విశేషం. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథని నడిపినట్లు ట్రైలర్ బట్టి అర్ధం అవుతుంది.
చైతూ యాక్షన్ హీరోగా: ట్రైలర్ చూస్తూ ఉంటే ఈ మూవీతో చైతూ యాక్షన్ హీరోగా తనని తాను ఎలివేట్ చేసుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక యువన్ శంకర్ రాజా, ఇళయరాజా మ్యూజిక్ కూడా కంటెంట్ ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఇక వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే మాయాజాలం ఈ చిత్రంలో కూడా ఉండబోతుందని ట్రైలర్ తో అర్ధం అవుతుంది. సినిమాపై హైప్ క్రియేట్ చేసే విధంగానే కస్టడీ ట్రైలర్ ఉండటం విశేషం. మరి ఈ సినిమా చైతూకి ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది చూడాలి. ఇక ఈ సినిమాతో నాగచైతన్య ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇటీవల అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమా ప్లాప్ కావడంతో ఈ హీరోల ఫ్యాన్స్ ఇప్పుడు కస్టడీ సక్సెస్ కావాలని ఆశతో ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











