Custody Teaser: చావు నన్ను వెంటాడుతోంది అంటున్న నాగచైతన్య.. ఊహించని యాక్షన్ డోస్!
నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తూ ఉండగా టాలీవుడ్ నిర్మాత శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్లో నిర్మిస్తున్నారు. ఇక కస్టడీ సినిమాకు సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. గతంలో కమర్షియల్ మాస్ ఎంటర్టైన్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన నాగచైతన్య ఈసారి కంప్లీట్ గా హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
ఈ సినిమాలో నాగచైతన్య ఒక కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ఎంతో ఆసక్తిగా ఉంది. 'గాయపడిన మనసు ఆ మనుషుల్ని ఎంత దూరమైనా తీసుకువెళుతుంది. అది నన్ను ఇప్పుడు తీసుకువచ్చింది ఒక యుద్ధానికి..' అంటూ నాగచైతన్య టీజర్ మొదట్లో చెప్పిన డైలాగ్ ఎంతో ఆసక్తిగా ఉంది. అంతేకాకుండా చావు నన్ను వెంటాడుతోంది.. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు.. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో ఉన్న ఆయుధం ఒక నిజం..' అని నాగచైతన్య చెప్పిన మరో డైలాగ్ కూడా టీజర్ లో చాలా హైలెట్ గా నిలిచింది.
ఇక నిజానికి ధైర్యం ఎక్కువ అంటూ అదే తన సైన్యం అనే విధంగా హీరో పాత్ర ఇందులో డెవలప్ చేసినట్లుగా అర్థమవుతోంది. ఇక సినిమాలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని ఒక సాధారణ కానిస్టేబుల్ ఎంతో బలవంతమైన విలన్స్ ను రాజకీయ నాయకులను ఎలా ఎదిరిస్తాడు? అనేది ఈ సినిమాలోని ప్రధానాంశం అని అర్థమవుతుంది.

ఇక యాక్షన్ డోస్ కూడా హై లెవెల్ లో ఉండబోతున్నట్లుగా కొన్ని విజువల్స్ ఎంతగానో అట్రాక్ట్ చేశాయి. తప్పకుండా ఈ సినిమాతో నాగచైతన్య యాక్షన్ ప్రియులను ఆకట్టుకుంటాడు అని అనిపిస్తోంది. వెంకట్ ప్రభు చాలా వేగంగా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశాడు. ఇక ఈ సినిమాలో సీనియర్ హీరో అరవింద్ స్వామి ఒక ముఖ్యమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











