వెళ్లిన పనిని పూర్తి చేసుకున్న నాగ చైతన్య: అక్కడి ఫొటోను షేర్ చేసిన రాశీ ఖన్నా

కొంత కాలంగా వరుస సినిమాలతో సత్తా చాటుతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. జయాపజయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా అతడు ఒకదాని తర్వాత ఒకటి ప్రారంభిస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించిన అతడు.. అది విడుదల కాకముందే మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ రూపొందిస్తోన్న 'థ్యాంక్యూ' మూవీ ఒకటి. ఈ సినిమా మొదటి షెడ్యూల్ గోదావరి పరివాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లో జరిగింది. ఈ క్రమంలోనే రెండో షెడ్యూల్ కూడా పూర్తైంది.

'మనం' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నాగ చైతన్య - విక్రమ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం 'థ్యాంక్యూ'. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కోసం చిత్ర యూనిట్ ఇటలీకి పయనమైంది. అక్కడ ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. పరిమితమైన సిబ్బందితో చిత్రీకరణను జరుపుకున్నారు. ఇలా దాదాపు 20 రోజుల పాటు షూటింగ్ చేసిన తర్వాత ప్యాకప్ చెప్పేశారు. తాజా సమాచారం ప్రకారం.. ఇటలీ దేశంలో తీసిన షాట్స్ అన్నీ సూపర్‌గా వచ్చాయట. అంటే.. అనుకున్న పనిని విజయవంతంగా పూర్తి చేసింది చిత్ర యూనిట్. దీంతో సమయం, ఖర్చు ఆదా అయ్యాయి.

Naga Chaitanya Raashi Khanna Complete Thank You Movie Italy schedule

ఇక, 'థ్యాంక్యూ' మూవీ షూటింగ్ సమయంలో దిగిన ఫొటోను తాజాగా హీరోయిన్ రాశీ ఖన్నా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేసింది. ఇందులో హీరో నాగ చైతన్యతో కలిసి ఆమె సెల్ఫీ దిగింది. ఇదిలా ఉండగా.. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను పోషిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X