పబ్లిక్‌గా అక్కినేని వారసుడిని కిస్ చేసిన హీరోయిన్.. వీడియో వైరల్
Recommended Video
అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి చిందులేసే అవకాశాన్ని పట్టేసిన సాయి పల్లవి ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమా నుంచి తాజాగా విడుదలైన పాట సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారుతోంది. ఈ పాటలో సాయి పల్లవి కిస్ సీన్ హైలైట్ అవుతోంది. వివరాల్లోకి పోతే..

శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు. యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకునేలా సరికొత్త కథాంశాన్ని ప్రేక్షకుల ముందుంచబోతున్నాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమాకు ''లవ్ స్టోరీ'' అనే క్యాచీ టైటిల్ కన్ఫామ్ చేశారు.

యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్
కమర్షియల్ హంగులు, భారీ యాక్షన్ సీన్లు, పెద్ద హీరోల జోలికి పోకుండా తనదైన శైలిలో అలరించడం శేఖర్ కమ్ముల స్టైల్. ''లవ్ స్టోరీ'' సినిమా కోసం కూడా తన రెగ్యులర్ పంథానే ఫాలో అవుతున్న ఈ డైరెక్టర్ ఈ సారి యూత్ ఆడియన్స్‌కి స్పెషల్ కిక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

''ఏ పిల్లా'' మ్యూజికల్ ప్రివ్యూ
'ఫిదా' లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న తదుపరి సినిమా ఇదే కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టారు యూనిట్ సభ్యులంతా. ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ చేస్తున్న టీమ్ తాజాగా ''ఏ పిల్లా'' మ్యూజికల్ ప్రివ్యూ రిలీజ్ చేశారు.

పబ్లిక్‌గా ట్రైన్‌లో కిస్
హరిచరణ్ పాడిన ఈ పాటకు చైతన్య పింగళి లిరిక్స్ రాశారు. ప్రేమికుల రోజు కానుకగా విడుదలైన ఈ సాంగ్ యూత్‌ని ఆకరిస్తోంది. పబ్లిక్‌గా ట్రైన్‌లో అక్కినేని వారసుడు నాగచైతన్యను సాయి పల్లవి కిస్ చేసిన సీన్ హైలైట్ అవుతోంది. దీంతో ఈ సాంగ్ చూసేందుకు ఎగబడుతున్నారు నెటిజన్లు.
లవ్ స్టోరీ రిలీజ్ డేట్
ఈ 'లవ్ స్టోరీ' సినిమాను లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14 తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కానీ పలు కారణాల వల్ల వాయిదా వేశారు. ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారట మేకర్స్.


Click it and Unblock the Notifications











