నాగ చైతన్య, సాయి పల్లవి లవ్ స్టోరీ: ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్
'జోష్' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ఆ వెంటనే 'ఏమాయ చేశావే', '100% లవ్' వంటి హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ కుర్రాడు.. ఆ తర్వాత చాలా ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాడు. వరుస పరాజయాలతో సతమతం అవుతోన్న సమయంలో తన భార్య అక్కినేని సమంతతో కలిసి చేసిన 'మజిలీ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. దీని తర్వాత వచ్చిన 'వెంకీ మామ' కూడా హిట్ అవడంతో చైతూ ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలోనే అతడు మరో ప్యూర్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
వయ్యారాల సోయగం.. మనీషా అందాల ఆరబోత
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రమే 'లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ డేట్ విషయంలో తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్యూర్ 'లవ్ స్టోరీ' ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుందట. ఈ విషయాన్ని త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించబోతుందని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. శేఖర్ కమ్ముల సినిమాలు అంటేనే సహజత్వంతో కూడి ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఈ 'లవ్ స్టోరీ'ని కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది. ఇది చూసిన తర్వాత సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి పోటీ పడి నటించినట్లు అర్థం అవుతోంది. వాళ్ల బాడీ లాంగ్వేజ్, యాస, హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.


Click it and Unblock the Notifications











