నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ: దాని మీదే ఎక్కువ ఫోకస్ చేసిన యూనిట్
అక్కినేని వారసుడు యువ సామ్రాట్ నాగ చైతన్య.. టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందించిన ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తైంది. దీన్ని విడుదల చేద్దామని అనుకున్న సమయంలో కరోనా రెండో దశ మొదలైంది. దీంతో థియేటర్లు మూతపడ్డాయి. ఫలితంగా ఈ చిత్రం విడుదల కాలేదు. దీంతో ఈ సినిమా కోసం అక్కినేని అభిమానులే కాదు.. శేఖర్ కమ్ముల చిత్రాలను ఇష్టపడే వాళ్లంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త లీకైంది.
కరోనా రెండో దశ ప్రభావం తగ్గడం.. జూలై 30 నుంచి తెలంగాణలో థియేటర్లు తెరుచుకోబోతుండడంతో కొత్త సినిమాల విడుదలపై క్లారిటీ వస్తోంది. ఈ క్రమంలోనే 'లవ్ స్టోరీ' మూవీ రిలీజ్ డేట్‌పై కూడా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను ఆగస్టు 20న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. అందుకే దీన్ని ఇండిపెండెన్స్ డే తర్వాత రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











