Naga Chaitanya's NC22 తాతయ్య పుట్టిన రోజున చైతూ.. ఎమోషనల్‌గా మూవీ షూటింగ్ ప్రారంభం!

అక్కినేని నటవారసుడు నాగచైతన్య వరుస చిత్రాలతో జోష్‌ను కొనసాగిస్తున్నాడు. లవ్ స్టోరి, బంగర్రాజు సినిమాలతో హిట్ కొట్టిన యువ సామ్రాట్ మరో సినిమాను పట్టాలెక్కిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్న NC22 చిత్రం షూటింగ్ రేపటి నుంచి అంటే.. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. తన తాత పుట్టిన రోజును శుభదినంగా భావించి నాగచైతన్య ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజ్ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో చార్ట్ బస్టర్ రానున్నదని నిర్మాత శ్రీనివాస చిట్టూరి విశ్వాసం ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా రూపొందున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం గురించిన వార్త బయటకు రాగానే అక్కినేని అభిమానుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ షూటింగ్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

 Naga Chaitanyas NC22 movie shoot starts at Ramoji Film City

నాగచైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో వస్తున్న ఇంకా పేరుపెట్టని చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభం అవుతున్నది. ఈసందర్బంగా స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు దివ్యాశీస్సులతో నాగచైతన్య, వెంకట్ ప్రభు సినిమా ప్రారంభం అవుతున్నది అని నిర్మాతలు ట్వీట్ చేశారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు.

నటీనటుల: నాగచైతన్య, కృతిశెట్టి తదితరులు
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
సమర్పణ: పవన్ కుమార్
దర్శకత్వం, కథ, స్క్రీన్ ప్లే: వెంకట్ ప్రభు
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
మ్యూజిక్: ఇళయరాజా, యువన్ శంకర్ రాజా
డైలాగ్స్: అబ్బూరి రవి
పీఆర్వో: వంశీ శేఖర్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X