India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగ చైతన్య థ్యాంక్యూ మూవీ వాయిదా.. దీని వెనుక అసలు కారణం ఏంటంటే!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది స్టార్లు తమ కొడుకులను హీరోలుగా పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే, అందులో కొందరు మాత్రమే సక్సెస్‌లను అందుకుని స్టార్లుగా ఎదిగిపోయారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కుమారుడు యువ సామ్రాట్ నాగ చైతన్య ఒకడు. ఆరంభంలోనే చాలా హిట్లను అందుకున్న అతడు.. ఆ తర్వాత వరుసగా పరాజయాలతో సతమతం అయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'మజిలీ' మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడని నాగ చైతన్య.. ఆ తర్వాత సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో కలిసి చేసిన మల్టీస్టారర్ మూవీ 'వెంకీ మామ', 'లవ్ స్టోరి', 'బంగార్రాజు' వంటి వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు.

  డెలివరీ తర్వాత ఊహించని లుక్‌లో ప్రణీత: ఆమెనిలా చూశారంటే షాకే!

  ఈ మధ్య కాలంలో అక్కినేని నాగ చైతన్య హిట్లు మీద హిట్లు కొడుతూ ఫుల్ ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. అందులో విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వస్తున్న 'థ్యాంక్యూ' మూవీ ఒకటి. 'మనం' వంటి ఫీల్‌ గుడ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక, ఈ సినిమా షూటింగ్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే, మధ్యలో ఎన్నో రకాల అవాంతరాలు ఎదురు కావడంతో ఈ సినిమా షూటింగ్ సజావుగా సాగలేదు. దీంతో దీన్ని అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయారు.

  Naga Chaitanyas Thank You Movie Postponed to July 22nd

  నాగ చైతన్య - విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'థ్యాంక్యూ' మూవీ బ్యాలెన్స్ వర్క్ కోసం ఇటీవలే షూటింగ్‌ను పున: ప్రారంభించారు. అప్పటి నుంచి శరవేగంగా జరుపుతూ తాజాగా టాకీ పార్ట్‌ను పూర్తి చేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, ఈ మేరకు యూనిట్ సభ్యులందరూ కలిసి దిగిన ఓ ఫొటోను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ సినిమా ప్రకటించిన డేట్‌కే విడుదల అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా మరోసారి వాయిదా పడినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

  శృతి మించిన యాంకర్ స్రవంతి గ్లామర్ ట్రీట్: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అలా అందాల కనువిందు!

  క్రేజీ కాంబోలో రూపొందుతోన్న 'థ్యాంక్యూ' మూవీని జూలై 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. అయితే, ఇప్పుడు ఈ సినిమాను రెండు వారాలు వాయిదా వేసి జూలై 22న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. దీంతో ఇప్పుడీ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'థ్యాంక్యూ' మూవీ ప్రమోషన్స్‌కు సరైన సమయం లేని కారణంగానే దీన్ని రెండు వారాల పాటు వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే ట్రైలర్‌ను రిలీజ్ చేసి.. అప్పటి నుంచి ప్రమోషన్‌ను షురూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ ఏరియాలో ప్రచారం జరుగుతోంది.

  'థ్యాంక్యూ'లో నాగ చైతన్య పలు విభిన్నమైన గెటప్‌లతో కనిపించనున్నాడు. అంతేకాదు, ఇందులో అతడు మహేశ్ బాబు అభిమానిగా నటిస్తున్నాడు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్‌ రవి కథ, మాటలు అందిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. రాశీ ఖన్నా, మాళవికా నాయర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌ అవికా గోర్ కీలక పాత్రను పోషిస్తోంది.

  English summary
  Akkineni Naga Chaitanya Now Doing Thank You Movie under Vikram K. Kumar Direction. Now This Movie Postponed to July 22nd.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X