ఇంట్రెస్టింగ్.. నాగ చైతన్య, సాయి పల్లవి మొదలు పెట్టేశారు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైత్య, హిట్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొత్త సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే అఫీషియల్‌గా ప్రకటించబడిన ఈ ప్రాజెక్ట్‌కి సంబందించిన రెగ్యులర్ షూట్ మొదలు పెట్టారు. ఈ రోజే (సెప్టెంబర్ 9) పూజా కార్యక్రమాలు నిర్వహించి సెట్స్ పైకి వచ్చేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
నిజానికి ఈ ప్రాజెక్ట్ గత నెలలోనే ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. నాగచైతన్య కెరీర్‌లో 20 సినిమాగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో చైతూ సరసన ఫిదా బ్యూటీ సాయి పల్లవి చిందులేయనుంది. ఇటీవలే ఫిదా సినిమాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్న శేఖర్ కమ్ముల.. అంతకు మించిన ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపొందించనున్నారని తెలుస్తోంది.

అత్యంత సాధారణంగా సాగే కథలో ఊహించని మలుపులు ఉండేలా చూసుకుంటూ ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్‌ని కట్టిపడేయటం శేఖర్ కమ్ముల స్టైల్. నాచురాలిటీకి పెద్ద పీట వేస్తూ ఆయన సినిమాలు తెరకెక్కుతాయి. అదే కోవలో నాగచైతన్య, సాయి పల్లవి జోడీని మరింత నాచురల్‌గా చూపించాలని శేఖర్ కమ్ముల ప్లాన్‌లో ఉందట. ఇటీవలే ఫిదా రూపంలో మెగా వారసుడితో జోడీ కట్టిన సాయి పల్లవి.. ఇప్పుడు అక్కినేని వారసుడితో జోడీ కడుతుండటం ఆసక్తికర అంశం. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై నారాయణ దాస్ కె నారంగ్, రామ్ మోహన్ రావు ఈ సినిమాకు రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











