Love story succes meet: గత జన్మలో ఆయన ఒక యోగి.. అమ్మాయిలకు ఒక ధైర్యం నింపారు: సాయి పల్లవి

మొత్తానికి చాలా కాలం తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరొక లవ్ స్టోరీ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది మంచి సినిమాలు వస్తాయి ప్రేక్షకులు మరోసారి బ్రహ్మరథం పడతారని క్లారిటీ వచ్చేసింది శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ సినిమా గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే ఈ సినిమా మొదటి రోజు ఏడు కోట్లకు పైగా షేర్ అందుకునే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది ఇప్పుడు చిత్ర యూనిట్ మ్యాజికల్ సక్సెస్ సెలబ్రేషన్స్ మరోసారి సినిమాపై హైప్ క్రియేట్ చేసింది ఇక ప్రత్యేకంగా నిర్వహించిన సక్సెస్ వేడుకల్లో హీరోయిన్ నాగచైతన్య సాయి పల్లవి ఎంతో ప్రత్యేకంగా మాట్లాడారు.

 అన్నమయ్య సినిమా వందసార్లు

అన్నమయ్య సినిమా వందసార్లు


హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ... మా సక్సెస్ మీట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి అలాగే సినీ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాగార్జున గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చాక ఎన్నో చెప్పాలని అనుకున్నాను. ఎందుకంటే మా తాత గారు అన్నమయ్య సినిమాను వంద సార్లు చూసి ఉంటారు. ఆయనతో పాటు మేమూ కూడా చాలాసార్లు చూశాం. ఆ సినిమా చూసినప్పటి నుంచి కూడా నాగ్ సర్ అంజి ఎంతో ఇష్టం. అందరం ఆయనకి అభిమానులయ్యాము.. అని తెలిపారు.

ఆయన గత జన్మలో యోగి

ఆయన గత జన్మలో యోగి

అన్నమయ్య మూవీ చూసిన తరువాత మా తాతయ్య ఏడుస్తుంటే అదొక యాక్టింగ్ మాత్రమే అంటూ తాతయ్యను ఓదార్చేవాళ్ళం. ఒకసారి తాతయ్య అన్నారు. ఇప్పుడు నటిస్తుండొచ్చు గాని గత జన్మలో నాగార్జున గారు ఒక యోగి అయ్యి ఉండవచ్చని చెప్పారు. అందుకే మీ సినిమాలు టీవీలో వస్తే ఛానెల్ మార్చేసేదాన్ని. ఎందుకంటే తాతయ్య దృష్టిలో మీరు ఎల్లప్పుడూ కూడా ఒక అన్నమయ్యే.. వివరణ ఇచ్చారు.

అమ్మాయిలకు ఒక ధైర్యం ఇచ్చారు

అమ్మాయిలకు ఒక ధైర్యం ఇచ్చారు


ఇవాళ సక్సెస్ ఈవెంట్ కు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. దర్శకుడు శేఖర్ గారు చెప్పినట్లు నైతికంగా అందారం కూడా న్యాయంగా ఉండాలని టీమ్ మొత్తం ఫాలో అయ్యాము. ఈ సినిమా ద్వారా ఒక అమ్మాయి తరుపున నిలబడి శేఖర్ గారు ఫైట్ చేశారు. సినిమా మేకింగ్ లో కూడా ఆయన మా కోసమే ఎక్కువగా మాట్లాడేవారు. మ్యూజిక్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ ఇలా ప్రతి విషయంలో కూడా లవ్ స్టోరి ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ చేసింది. నిర్మాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఒక సినిమాను థియేటర్ లో చూసి ఎంజాయ్ చేసి చాలా రోజులైంది. ఇన్నాళ్లకు ఒక లవ్ స్టోరి తో మళ్లీ ఆ భావాన్ని ఆస్వాదిస్తున్నాం. ప్రేక్షకులందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ సినిమాలో జరిగినట్లు నాకు అయింది అని చెప్పేందుకు అమ్మాయిలకి ఒక ధైర్యాన్ని లవ్ స్టోరి ఇచ్చింది అన్నారు.

ఫస్ట్ భయపడ్డాను..

ఫస్ట్ భయపడ్డాను..

హీరో నాగ చైతన్య మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ రోజు హ్యాపీగా ఉంది. లవ్ స్టోరి మూవీ సక్సెస్ ను అందరితో సెలబ్రేట్ చేసుకోవడం ఒక స్పెషల్ మూమెంట్. ఎన్నో రోజులుగా పాండమిక్ వల్ల లవ్ స్టోరి సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే శుక్రవారం వస్తే మూవీస్ థియేటర్ లలో ఎలా ఉన్నాయి, వాటి రిజల్ట్ ఏంటి అనే విషయం గురించి ఎప్పుడూ గమనిస్తుంటాను. కానీ కరోనా పాండమిక్ వల్ల అది మిస్ అయ్యాను. ఇక ఫైనల్ గా ఈ నెల 24న ఆ మ్యాజిక్ డే నాకు రాగానే అసలు థియేటర్ కు జనాలు వస్తారా లేదా అని భయపడ్డాం. కానీ మీరు వచ్చి చూస్తున్నారు.

Recommended Video

Love Story Movie Success Meet | Naga Chaitanya | Sai Pallavi

ఎంతోమంది స్టార్స్ కోరుకున్నారు

అందుకే చాలా కృతజ్ఞతలు. నిజంగా ఒక తెలుగు సినిమా ప్రేక్షకులు చిత్రాలను ఆదరించినట్లు దేశంలో మరెక్కడా కూడా ఆదరించలేదు. దర్శకుడు శేఖర్ కమ్ముల గారి కంటెంట్, ఆయనకున్న గుడ్ విల్ ఏమిటో లవ్ స్టోరి సక్సెస్ చూపిస్తోంది. మన జర్నీ ఏ మాత్రం ఆగొద్దు, ఇకపైనా మంచి సినిమాలు చేద్దాం. సినిమా రిలీజ్ అయ్యే ముందు లవ్ స్టోరి హిట్ కావాలని ఎంతోమంది స్టార్స్, దర్శకులు కూడా కోరుకున్నారు. మనమంతా ఒక ఫ్యామిలీ అనే ఫీల్ క్రియేట్ చేశారు. వాళ్లందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలాగే మా నిర్మాతలు కంటెంట్ నమ్మారు. థియేటర్ లో రిలీజ్ అవ్వాలని ఎన్నో రోజుల నుంచి హోల్డ్ చేశారు. ఇక ఫైనల్ గా లవ్ స్టోరి చిత్రంతో శేఖర్ గారు చాలా మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశారు. ఈ మ్యాజికల్ సక్సెస్ సందర్భంగా లవ్ స్టోరి టీమ్ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అంటూ కొత్త సినిమా అయినా నన్ను బాగా ఎంకరేజ్ చేశారని చెప్పిన చైతన్య.. కొత్త తరహా సినిమా చేస్తే మీ ఆదరణ ఉంటుందని నిరూపించారని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X