సమంత లవ్లీ ఉమెన్.. విడిపోవడానికి కారణం అదే.. అసలు నిజం చెప్పిన నాగ చైతన్య
కింగ్ నాగార్జున కుమారుడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. జోష్ సినిమాతో తెరంగేట్రం చేసిన చైతూ సినీ ఇండస్ట్రీకి వచ్చి 14 ఏళ్లు కావొస్తుంది. ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకున్నా కథ పరంగా ప్రశంసలు అందుకుంది. తర్వాత ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్ కొట్టిన నాగ చైతన్య లవర్ బాయ్ గా మెప్పించాడు. ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ సమంతతో ఏర్పడిన పరిచయం ప్రేమ, పెళ్లి, విడాకుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సమంతతో విడిపోవడానికి గల కారణాలు బయట పెట్టాడు నాగ చైతన్య.
కోలీవుడ్ డైరెక్టర్
ప్రస్తుతం నాగ చైతన్య ద్విభాష చిత్రంలో నటిస్తున్నాడు. కస్టడీ అనే మూవీ ద్వారా ఒకేసారి ఇటు తెలుగు, అటు తమిళం బైలింగువల్ ప్రాజెక్టుతో అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. చైతూకి ఇది తొలి తమిళ స్ట్రెయిట్ సినిమా. దీనికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా కృతీ శెట్టి అలరించనుంది.

నటీనటులు
కస్టడీ సినిమాలో నాగ చైతన్య ఎప్పుడు చేయని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. అలాగే సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్నాడు. ఇందులో ప్రియమణి, శరత్ కుమార్, ప్రేమి విశ్వనాథ్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్ తదితరులు నటిస్తున్నారు. కస్టడీ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.

విడుదల తేది, ట్రైలర్ కట్
ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి కస్టడీ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా కస్టడీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందులో చైతూ యాక్షన్ సీన్స్, అరవింద్ స్వామి నటన అంచనాలను పెంచేలా ఉన్నాయి.

రాని క్లారిటీ
ఇక నాగ చైతన్య పర్సనల్ విషయానికొస్తే స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లాడిన చైతూ విడిపోతున్నట్లు ప్రకటించి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్లు విడిపోవడానికి అసలు కారణం ఎవరూ సరిగా చెప్పలేదు. దీనికితోడు పలు రూమర్స్, సమంతపై ట్రోలింగ్ దారుణంగా జరిగింది. ఎన్ని విషయాలు జరిగిన ఇది కారణం అని మాత్రం ఎవరికీ ఏ క్లారిటీ రాలేదు.

గౌరవంగానే చూశా
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత గురించి, తన జీవితం గురించి నాగ చైతన్య ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "మేము విడిపోయి రెండు సంవత్సరాలు అయింది. అధికారికంగా విడాకులు తీసుకుని ఏడాది పూర్తయింది. డివోర్స్ తర్వాత మా ఇద్దరి జీవితాలు వేర్వేరుగా కొనసాగుతున్నాయి. ఇద్దరం వేరైనా ఆమెతో కలిసి ఉన్నన్ని రోజులు చాలా గౌరవంగానే చూశాను" అని నాగ చైతన్య తెలిపాడు.

ఏదేదో ఊహించుకుని
"నిజానికి సమంత ఒక లవ్లీ ఉమెన్. ఆమె అన్ని ఆనందాలకు అర్హురాలు. మీడియా ఊహగానాల కారణంగానే మా మధ్య గొడవలు జరిగాయి. అవి పెద్దవయ్యాయి. చివరికి విడిపోవాల్సి వచ్చింది. వాస్తవానికి నేను మొదట్లో ఆ ఊహగానాల గురించి అంతగా పట్టించుకోలేదు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు మారాయి. ప్రజలు ఇప్పటికీ నా పెళ్లి గురించి అనేక విషయాలు చర్చింకుంటున్నారు. ఏదేదో ఊహించుకుంటున్నారు" అని చైతూ పేర్కొన్నాడు.

మళ్లీ కలవాలని
"ప్రస్తుతం నేనుచాలా సంతోషంగా ఉన్నాను. జీవితం చాలా బాగుంది. జీవితంలో ప్రతి అంశం నేర్చుకోదగినదే. నేను నా గతం, నా వర్తమానం, భవిష్యత్తును సానుకూలతతో చూస్తాను. ఏది జరిగినా నా మంచికే అనుకుంటాను" అని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే మళ్లీ నాగ చైతన్య-సమంత కలిస్తే చూడాలని కోరుకునే అభిమానులు, ప్రేక్షకులు ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications











