Don't Miss!
- News త్వరలో గురు-శుక్ర సంయోగం.. ఈ రాశులవారికి పట్టిందల్లా బంగారం
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సెట్టయిన మనం కాంబినేషన్.. స్పెషల్ ప్లాన్ తో స్క్రిప్ట్ రెడీ!
టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య మళ్ళీ మనం దర్శకుడితో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. డిఫరెంట్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ కె కుమార్ నెక్స్ట్ సినిమాపై మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇచ్చాడు. మొదట వీరి కాంబినేషన్ లో ఒక హారర్ మూవీ రానున్నట్లు రూమర్స్ వచ్చాయి.
విక్రమ్ మొదటి సినిమా 13బి కి సీక్వెల్ గా ఉండబోయే కథలోనే నాగ చైతన్య నటించనున్నట్లు కథనాలు రావడంతో వెంటనే అవన్నీ రూమర్స్ అని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. అసలు విషయంలోకి వస్తే.. ఈ సారి నాగ చైతన్యతో చేయబోయే సినిమా ఫుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా ఉండనుందట. ఇక సినిమాకు ఒక టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
సింపుల్ గా 'థాంక్యూ' అనే టైటిల్ సినిమా కథకు కరెక్ట్ గా సరిపోతుందని నాగార్జున ఆలోచన మేరకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక విక్రమ్ గత కొంత కాలంగా సరైన సక్సెస్ అందుకోలేదు. నానితో చేసిన గ్యాంగ్ లీడర్ కలెక్షన్స్ పరంగా పెద్దగా లాభాలను అంధించలేకపోయింది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా బ్యాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని స్క్రిప్ట్ పక్కా ప్లాన్ తో రెడీ చేసుకున్నట్లు సమాచారం.