Thank You Trailer: నాగచైతన్య ఎమోషనల్ జర్నీ.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమ ఎంతో గొప్పది అంటూ..

నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా ఈనెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేశాడు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న ఈ సినిమా మొత్తానికి థియేట్రికల్ గా విడుదల కావడానికి సిద్ధమైంది. మనం కాంబినేషన్ తర్వాత నాగచైతన్యతో ఈ దర్శకుడు వర్క్ చేస్తూ ఉండడంతో సినిమాకు మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక థాంక్యూ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఇక మొత్తంగా ఈ సినిమా ట్రైలర్ ఏ విధంగా ఉంది అనే వివరాల్లోకి వెళితే..

ఎమోషనల్ జర్నీ

ఎమోషనల్ జర్నీ

అక్కినేని హీరో నాగ చైతన్య రాశిఖన్నా మాళవిక మోహనజ్ నటించిన ఈ సినిమాలో అవికా గోర్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఒక వ్యక్తి ఎమోషనల్ లైఫ్ జర్నీకి సంబంధించిన కాన్సెప్ట్ లో థాంక్యూ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ ద్వారా ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నాగచైతన్య కొన్ని డిఫరెంట్ ఏజస్ లో ఆకట్టుకోబోతున్నట్లు ట్రైలర్లు చూపించారు.

 హాకీ ప్లేయర్ గా చైతూ

హాకీ ప్లేయర్ గా చైతూ

టీనేజ్ వయసు నుంచి తను అనుకున్న డ్రీమ్ కోసం ఒక వ్యక్తి ఏ విధంగా కష్టపడ్డాడు అలాగే మధ్యలో వచ్చిన కొంతమంది అమ్మాయిల కారణంగా అతని డ్రీమ్ విషయంలో ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది కూడా సినిమాలో హైలెట్ చేసి చూపించబోతున్నట్లు అనిపిస్తోంది. ఇక నాగచైతన్య హాకీ ప్లేయర్ గా సినిమాలో నటించినట్లు చూపిస్తున్నారు.

 పవర్ఫుల్ డైలాగ్స్

పవర్ఫుల్ డైలాగ్స్

ఇక ఈ సినిమాలో డైలాగ్స్ కూడా ఎంతో ఆలోచింపజేస్తున్నాయి. మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మనం చేరిన గమ్యానికి విలువుండదు అని ఒక ఫ్రెండ్ చెప్పాడు.. అని నాగచైతన్య అద్భుతమైన మాటతో ఈ సినిమా ట్రైలర్ మొదలయ్యింది. ఇక చిన్నప్పటి నుంచి గ్రామంలోనే ఉన్న హీరో ఫ్లైట్ ఎక్కి ఆ తరువాత విదేశాలకు వెళ్లడం అనంతరం మరో ఉన్నత స్థాయికి వెళ్లినట్లు ఎమోషనల్ జర్నీని కూడా హైలెట్ చేశారు.

 రాఖీ కట్టిన హీరోయిన్

రాఖీ కట్టిన హీరోయిన్

అయితే లైఫ్ జర్నీలో ముగ్గురు హీరోయిన్స్ తో హీరో లవ్ ట్రాక్ బ్రేకప్స్ కూడా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ముందుగా అవికా గోర్ నాగచైతన్యకు రాఖీ కట్టడం అన్నయ్య అవుతావని చెప్పడం డిఫరెంట్ గా ఉంది. ఆ తరువాత మాళవిక మోహనన్ అనంతరం రాశి ఖన్నాతో కూడా డిఫరెంట్ లవ్ యాంగిల్ ను చూపిస్తున్నారు.

ఆ ప్రేమ ఎంతో గొప్పది

ఆ ప్రేమ ఎంతో గొప్పది

ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే.. స్వేచ్ఛగా వదిలేయగల ప్రేమ ఎంతో గొప్పది.. అనే డైలాగ్ కూడా ఎంతో ఆలోచింపజేసే విధంగా ఉంది. మొత్తంగా ట్రైలర్ లో హాకీ ఆట, హీరో లవ్ ట్రాక్స్ , ఆ తరువాత సక్సెస్ ఇలా ఎన్నో కోణాల్లో మనిషి ఎమోషన్స్ ని దర్శకుడు చూపించేందుకు థాంక్యూ సినిమాతో సిద్ధమైనట్లు అనిపిస్తోంది. మరి ఈ సినిమా వెండితెరపై ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక దిల్ రాజు నిర్మిస్తున్న థాంక్యూ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X