Custody Movie: నాగ చైతన్య 'కస్టడీ' విడుదలకు డేట్ ఖరారు.. తొలిసారిగా తండ్రికొడుకులు!

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు నాగ చైతన్య. జోష్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తనదైన శైలీలో సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. సినిమాలు హిట్ అయిన, ఫ్లాప్ అయినా.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ అక్కినేని హీరో. అంతేకాకుండా సినీ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ విషయాలకు దూరం ఉంటూ టాలీవుడ్ గుడ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు.

ఇటీవల హిందీలో ఎంట్రీ ఇచ్చిన నాగా చైతన్యకు అంతగా వర్కౌట్ కాలేదు. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

ముద్దు సీన్లతో..

ముద్దు సీన్లతో..

టాలీవుడ్​ మన్మథుడు, కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీకి నాగ చైతన్య ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావొస్తుంది. నాగచైతన్య 2009లో జోష్ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. అక్కినేని కుటుంబం నుంచి హీరో వస్తుండటంతో సినీ అభిమానుల్లో, అక్కినేని ఫ్యాన్స్‌ నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. అయితే సినిమా విడుదలైన తర్వాత అంచనాలన్నీ తారుమారయ్యాయి. తర్వాత గౌతమ్​ వాసుదేవ్​ మీనన్​ దర్శకత్వంలో వచ్చిన ఏ మాయ చేసావే సినిమాతో మంచి హిట్​ కొట్టాడు నాగ చైతన్య. ఏ మాయ చేశావే సినిమాలో ముద్దు సీన్లు, నటనతో యూత్​ను ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు.

వర్కౌట్ కానీ లాల్ సింగ్ చద్దా..

వర్కౌట్ కానీ లాల్ సింగ్ చద్దా..

ఏ మాయ చేశావే ఈ సినిమాలో నటనకు గానూ ఉత్తమ నటుడిగా ఫిల్మ్​ఫేర్​ అవార్డు కూడా అందుకున్నాడు. అనంతరం క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్​ దర్శకత్వంలో మిల్కీ బ్యూటీ తమన్నాతో నాగ చైతన్య జోడి కట్టిన చిత్రం 100% లవ్. ఈ సినిమా కూడా బ్లాక్​ బస్టర్ హిట్​ అయింది. దీంతో చైతూ లవర్ బాయ్​గా ముద్ర వేసుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే మనం వంటి హిట్​ ఇచ్చిన విక్రమ్ కె కుమార్​ దర్శకత్వంలో వచ్చిన థ్యాంక్యూ మూవీ సినీ ప్రియులను నిరాశపరిచింది. లాల్ సింగ్ చద్ధాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా అది కూడా వర్కౌట్ కాలేదు. దీంతో సినిమా ఎంపికలో జాగ్రత్త వహిస్తున్నాడు చైతూ. ఇందులో భాగంగానే కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటిస్తున్నాడు నాగ చైతన్య.

ఇదే తొలిసారి..

కస్డడీ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. నాగ చైతన్యకు ఇది తొలి స్ట్రయిట్ తమిళ సినిమా. నాగ చైతన్య 22వ సినిమాగా వస్తున్న కస్డడీ ఫస్ట్ లుక్ ను ఇటీవల విడుదల చేశారు. చైతూ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ ఇచ్చారు. నాగ చైతన్య కస్టడీ మూవీని వచ్చే ఏడాది మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సీనియర్ హీరో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకేసారి పనిచేయడం ఇదే తొలిసారి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X