‘ధూత’గా మారిపోయిన నాగ చైతన్య.. అక్కినేని చిన్నోడి లుక్ అదిరిపోయిందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఏఎన్నార్ తర్వాత ఆ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇవ్వడమే. అలా వచ్చిన వారిలో నాగార్జునతో పాటు సక్సెస్ అయ్యాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. చాలా కాలం క్రితమే హీరోగా వచ్చిన అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. అలాగే, కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అవడంతో పాటు కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే శివ నిర్వాణ తెరకెక్కించిన 'మజిలీ' అనే మూవీతో హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి దూసుకుపోతున్నాడు.
కొంత కాలంగా హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్న నాగ చైతన్య.. గత ఏడాది 'లవ్ స్టోరీ' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ యంగ్ హీరో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే, ఈ సంక్రాంతికి 'బంగార్రాజు'గానూ వచ్చి మెప్పించాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను దాదాపుగా పూర్తి చేసేసుకున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటిస్తున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఈ యంగ్ హీరో.. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసుకున్నాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం 'ధూత' అనే వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్నాడని తెలిసిందే. దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని భారీ బడ్జెట్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్నారు.
ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీయబోయే ఈ వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. ఇక, తాజాగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం అయింది. అంతేకాదు, ఇది మొదలైనట్లు బయటకు వచ్చిన ఫొటో ద్వారా స్పష్టం అయింది. ఇందులో నాగ చైతన్య క్లీన్ షేవ్‌తో కూడిన లుక్‌తో కనిపించాడు. దీంతో ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దీన్ని హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రేజీ కాంబినేషన్‌లో రూపొందనున్న 'ధూత' వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు. హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందని తెలుస్తోంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











