twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Dhootha: నాగ చైతన్య వెబ్ సిరీస్ టైటిల్ లీక్.. ఊహించని పాత్రలో అక్కినేని స్టార్

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా మంది వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు. అయితే, అందులో కొందరు మాత్రమే మంచి గుర్తింపును అందుకుని, స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. తద్వారా సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అలాంటి వారిలో యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఒకడు. చాలా కాలం క్రితమే హీరోగా వచ్చిన అతడు.. విభిన్నమైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అలాగే, కొన్ని హిట్లను కూడా ఖాతాలో వేసుకున్నాడు. అయితే, చాలా కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయ్యాడు. ఈ నేపథ్యంలోనే 'మజిలీ' మూవీ నుంచి వరుస హిట్లతో దూసుకుపోతోన్నాడు.

    <strong>సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో!</strong>సిరి హన్మంత్‌కు శ్రీహాన్ బ్రేకప్: బిగ్ బాస్ కంటెస్టెంట్‌ ఫ్యామిలీతో కలిసి కనిపించడంతో!

    ఈ మధ్య హిట్లు మీద హిట్లు కొడుతూ సత్తా చాటుతోన్న నాగ చైతన్య.. గత ఏడాది శేఖర్ కమ్ముల రూపొందించిన 'లవ్ స్టోరీ' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇది కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో హ్యాట్రిక్ విజయాలను ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అలాగే, ఈ సంక్రాంతికి 'బంగార్రాజు'గానూ మెప్పించాడు. ఈ ఉత్సాహంతోనే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో సినిమాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే అతడు విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో 'థ్యాంక్యూ' అనే సినిమాను మొదలు పెట్టేశాడు. ఇది ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుతున్నారు.

    Naga Chaitanya Web Series Titled as Dhootha

    తెలుగు సినిమాలే కాదు.. అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే హిందీ మూవీలోనూ నటిస్తున్నాడు. ఆమిర్ ఖాన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో అతడు.. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఓ తెలుగు కుర్రాడి పాత్రను పోషిస్తున్నాడు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూటింగ్‌ను కూడా అతడు పూర్తి చేసేశాడు. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న చైతూ.. ఇప్పుడు అమెజాన్ సంస్థ కోసం ఓ వెబ్ సిరీస్‌ను కూడా చేయబోతున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సిరీస్‌కు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది. దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి.

    బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!బట్టలున్నా లేనట్లే మలైకా అరోరా అరాచకం: 48 ఏళ్ల వయసులో శృతి మించి మరీ దారుణంగా!

    అమెజాన్ ప్రైమ్ సంస్థ ప్రతిష్టాత్మకంగా తీయబోయే ఈ వెబ్ సిరీస్‌ను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన విక్రమ్ కే కుమార్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో చాలా మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్‌కు 'ధూత' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన, పోస్టర్‌ మరికొద్ది రోజుల్లోనే బయటకు రాబోతున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సిరీస్‌.. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోందని అంటున్నారు. దీన్ని సింగిల్ షెడ్యూల్‌లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.

    క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్‌లో అక్కినేని నాగ చైతన్య క్రూరమైన విలన్ పాత్రను చేస్తున్నాడట. ఒకరకంగా ఇది సైకోను పోలి ఉంటుందని అంటున్నారు. హీరోగా సత్తా చాటుతోన్న అతడు.. ఇప్పుడీ ప్రయోగం చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక, ఇందులో అతడికి జోడీ ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోందని తెలుస్తోంది.

    English summary
    Akkineni Naga Chaitanya Alredy Doing 3 Movies. Recently He Green Signal to Web Series for Amazon Prime. This Series Titled as Dhootha
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X