22 ఎకరాల్లో నాగచైతన్య పెళ్లి వేడుక.. చారిత్రాత్మక ప్రదేశంలో శోభితతో వివాహం.. హల్తీ, మెహందీ, సంగీత్ ఎప్పుడంటే?
యువ సామ్రాట్ నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి వేడుకకు సంబంధించిన కార్యక్రమాలు జోరుగా ప్రారంభమవుతున్నాయి. తన పెళ్లికి సంబంధించిన పలు వేడుకలకు చెందిన ఫోటోలను శోభితా తన అభిమానులతో షేర్ చేసుకొంటూ సమాచారం అందిస్తున్నారు. అయితే నాగచైతన్యతోపాటు ఆయన కుటుంబ సభ్యులు మాత్రం తన పెళ్లికి సంబంధించిన విషయాలపై మౌనంగా ఉంటూ వస్తున్నారు. అయితే చైతూ, శోభితకు సంబంధించిన పెళ్లికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
శోభిత ఇంట్లో సంప్రదాయంగా పెళ్లి వేడుకలను వేద పండితుల పూజల మధ్య నిరాడంబరంగా ప్రారంభించారు. పూజ చేసిన అనంతరం పెళ్లికి కావాల్సిన పసుపు దంచుడు కార్యక్రమాన్ని తన తల్లిదండ్రులతో కలిసి నిర్వహించారు. స్వయంగా తన చేతులతో పసుపు దంచుతూ ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ ఫోటోలను షేర్ చేయగా.. ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి.

ఇదిలా ఉండగా, ఇటీవల శోభిత ధూళిపాల పెళ్లికి సంబంధించిన విషయాలను ఆమె సోదరి డాక్టర్ సమంత ధూళిపాల కూడా షేర్ చేస్తున్నారు. తన సోదరితో దిగిన ఫోటోను షేర్ చేస్తూ కౌంట్‌డౌన్ మొదలైంది అంటూ హింట్ ఇచ్చారు. ఇలా పెళ్లికి సంబంధించిన వేడుకలను ధూళిపాల ఫ్యామిలీ సంప్రదాయంగా నిర్వహిస్తున్నట్టు తెలిసింది.
అయితే డిసెంబర్ 4వ తేదీన జరిగే నాగచైతన్య పెళ్లిలో భాగంగా జరుగాల్సిన హల్దీ, సంగీత్, మెహందీ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హల్దీ వేడుక డిసెంబర్ 1వ తేదీన, మెహందీ 2వ తేదీన, సంగీత్ 3వ తేదీన నిర్వహిస్తారని విషయం బయటకు వచ్చింది. ఈ వేడుకల్లో ఇరు కుటుంబాల సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఉంటారని తెలియవచ్చింది.
ఇక పెళ్లిలో భాగంగా జరిగే హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకతోపాటు వివాహం కార్యక్రమాన్ని 22 ఎకరాల్లో ఉన్న ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తమ కుటుంబానికి భావోద్వేగంతో కూడిన బంధం అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్నందున.. ఆయన సమక్షంలో, ఆయనకు ఇష్టమైన ప్రాంతంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

అన్నపూర్ణ స్టూడియో విషయానికి వస్తే.. ఈ స్టూడియోతో కేవలం అక్కినేని ఫ్యామిలీకి మాత్రమే కాదు.. సినీ వర్గాల అందరికీ ఓ ఎమోషనల్ బాండింగ్ ఉంది. చెన్నై నుంచి సినీ పరిశ్రమ హైదరాబాద్‌కు తరలిరావడానికి బాట వేసిన దానిలో ముందడుగు వేసింది. ఎన్నో వందల చిత్రాలు ఇక్కడే రూపొందాయి. అలాంటి ప్రఖ్యాత స్టూడియోలో కనీవినీ ఎరుగని రీతిలో భారీ సెట్ వేసి వివాహం చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications











