Love Story మూవీ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్: ఆ తేదీనే ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. అయినప్పటికీ అనివార్య కారణాల వల్ల సినిమా విడుదల మాత్రం కాలేదు. ఇక, ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో పాటు థియేటర్ల ఓపెనింగ్‌కు లైన్ క్లియర్ అయింది. దీంతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని ఖరారు చేసినట్లు ఓ న్యూస్ ఫిలిం నగర్‌లో తెగ చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇది తొలగించిన తర్వాతనే తమ సినిమాను విడుదల చేసే అవకాశాలను పరిశీలిస్తామని ఇటీవల 'లవ్ స్టోరీ' నిర్మాతలు వెల్లడించిన విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 30న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా తెలిసింది. అప్పటికి రెండు రాష్ట్రాల్లో పరిస్థితులు సర్ధుకుంటాయని.. అందుకే నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెల్లడవుతుందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

Naga Chaitanyas Love Story Release on July 30th

స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథతో తెరకెక్కిన 'లవ్ స్టోరీ' సినిమా నుంచి టీజర్, పాటలు, పోస్టర్లకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరిగింది. ఇక, ఈ సినిమాను ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X