Love Story Release Date: ఆ స్పెషల్ డేన రాబోతున్న నాగ చైతన్య కొత్త సినిమా

కెరీర్ ఆరంభం నుంచి ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఎన్నో పరాజయాలను చవి చూసినా.. కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు అక్కినేని హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య. ఈ ఉత్సాహంతో మరిన్ని చిత్రాలను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. తద్వారా చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే అతడు ఇటీవల టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో 'లవ్ స్టోరీ' అనే సినిమాను చేశాడు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తైనా అనివార్య కారణాల వల్ల ఇది ఇప్పటి వరకూ ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు.

'లవ్ స్టోరీ' మూవీని ఎప్పుడో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. కానీ, కరోనా రెండో దశ కారణంగా ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని అప్పట్లో యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక, ఇప్పుడు ఆ పరిస్థితులు చక్కబడడంతో పాటు థియేటర్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

Naga Chaitanyas Love Story Release on September 10th

వాస్తవానికి 'లవ్ స్టోరీ' మూవీని ఆగస్టు 19న కానీ, 29న కానీ విడుదల చేస్తారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ, యూనిట్ నుంచి మాత్రం దీనిపై క్లారిటీ రాలేదు. దీంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా విడుదల విషయంలో అయోమయానికి గురవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం.. 'లవ్ స్టోరీ' మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెబర్ 10న విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇటీవలే డిస్ట్రిబ్యూటర్లతో చర్చలు జరిపిన తర్వాత యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. దీనికి సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ కూడా గట్టిగానే వినిపిస్తోంది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

ఇదిలా ఉండగా.. 'లవ్ స్టోరీ' సినిమాలోని 'దాని కుడీ భుజం మీద కడువా... దాని పుస్తెపు రైకలు మెరియా... అది రమ్మంటె రాదు సెలియా.. దాని పేరే సారంగ దరియా' అంటూ సాగే ఫోక్ సాంగ్‌లో సాయి పల్లవి అదిరిపోయే స్టెప్పులతో అలరించింది. దీంతో ఈ పాట తాజాగా 300 మిలియన్ వ్యూస్ మార్కును చేరుకుంది. తద్వారా ఈ ఘనతను అందుకున్న అతి తక్కువ పాటల్లో ఒకటిగా నిలిచింది. అన్నింటి కంటే ముఖ్యంగా వేగంగా 300 మిలియన్ వ్యూస్ రాబట్టిన తొలి సౌతిండియా సాంగ్‌గా 'సారంగ దరియా' రికార్డు క్రియేట్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X