Love Story కొత్త రిలీజ్ డేట్ ప్రకటన: అందుకే వాయిదా వేశామంటూ లేఖ విడుదల

కోవిడ్ మహమ్మారి తెలుగు సినీ ఇండస్ట్రీపై ఎంతటి ప్రభావాన్ని చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని వల్ల గత ఏడాది ఒకరి.. ఈ సంవత్సరం మరోసారి లాక్‌డౌన్‌లు వచ్చాయి. దీంతో షూటింగ్‌లు ఆగిపోవడం, సినిమా హాళ్లు మూతపడడం వంటివి జరిగాయి. ఫలితంగా ఎంతో మంది దర్శక నిర్మాతలకు నష్టాలు వచ్చాయి. అలాగే, థియేటర్ల యాజమాన్యాలు సైతం సినిమాలు లేక మూత వేయాల్సిన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఇక, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న టికెట్ రేట్ల ఇష్యూతో చాలా సినిమాలు విడుదల కాకుండానే ఉండిపోవాల్సిన దుస్థితులు నెలకొన్నాయి.

కరోనా ప్రభావంతో పలుమార్లు వాయిదా పడిన చిత్రాల్లో అక్కినేని నాగా చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' ఒకటి. క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఈ సినిమా మూవీని ఎప్పుడో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. కానీ, కరోనా రెండో దశ కారణంగా ఇది సాధ్య పడలేదు. దీంతో ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే, ఈ వార్తలో ఎటువంటి నిజం లేదని అప్పట్లో యూనిట్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక, ఇప్పుడు ఆ పరిస్థితులు చక్కబడడంతో పాటు థియేటర్లు కళకళలాడుతున్నాయి.

కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాల పండుగ నడుస్తోంది. దీంతో 'లవ్ స్టోరీ' మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల ఇష్యూ, నైట్ కర్ఫ్యూ అమలలో ఉండడం, దీనికితోడు పండుగ రోజు నాని నటించిన 'టక్ జగదీష్' సహా పలు చిత్రాలు ఓటీటీలో విడుదల కాబోతుండడం వంటి కారణాలతో ఈ చిత్రాన్ని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇది ఎప్పుడు విడుదల అవుతుందన్న దానిపై చాలా రకలా చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా చిత్ర యూనిట్ దీనిపై స్పందించింది.

Naga Chaitanyas Love Story Release on September 24th

'లవ్ స్టోరీ' సినిమా వాయిదా పడడంపై చిత్ర యూనిట్ తాజాగా స్పందించింది. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. ఇందులో 'అనివార్య పరిస్థితుల కారణంగా లవ్ స్టోరీ మూవీని వాయిదా వేశాము. మా సినిమాను మీకు చూపించేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నాము. కాబట్టి 'లవ్ స్టోరీ' మూవీని సెప్టెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. మీరంతా మా సినిమాను థియేటర్లలో చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు' అంటూ పేర్కొన్నారు. తద్వారా ఈ చిత్ర విడుదలపై వస్తున్న వార్తలకు ఒక్క లేఖతో పుల్‌స్టాప్ పెట్టేశారు.

క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి దగ్గర డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుందట. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X