‘లవ్ స్టోరీ’ టీజర్ రిలీజ్: ఎమోషనల్ ప్రేమకథలో నాగ చైతన్య.. సాయి పల్లవి

అక్కినేని ఫ్యామిలీ నుంచి సినిమాల్లోకి ప్రవేశించాడు యువ సామ్రాట్ నాగ చైతన్య. 'జోష్' అనే సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన అతడు.. ఆ తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించాడు. కెరీర్ ఆరంభంలోనే పలు హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ కుర్రాడు.. చాలా కాలంగా సరైన బ్రేక్ దొరకక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి సమయంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే నాగ చైతన్య.. నేచురల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో 'లవ్ స్టోరీ' అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదలైంది.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటిస్తోన్న చిత్రమే 'లవ్ స్టోరీ'. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సున్నితమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. నిమిషం పాటు ఉన్న ఇందులో హీరో, హీరోయిన్లపై తీసిన కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా సాగాయి. ఉద్యోగాన్వేషణలో విఫలమైన నాగ చైతన్య, సాయి పల్లవి ఒక చోట కలిసి.. ప్రేమలో పడడంతో ఈ మూవీ స్టార్ట్ అవుతుందని టీజర్‌ను బట్టి అర్థం అవుతోంది.

Naga Chaitanyas Love Story Teaser Released

ఇక, ఈ సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి ఇద్దరూ డ్యాన్సర్లుగా కనిపిస్తున్నారు. అలాగే, టీజర్‌లో సాఫ్ట్‌వేర్ జాబ్ చేయొద్దని, దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయని హీరో.. హీరోయిన్‌కు చెప్పే సీన్‌ను హైలైట్ చేశారు. ఇక, చివర్లో ఇద్దరూ పారిపోతూ కనిపిస్తారు. అలాగే, పవన్ సీహెచ్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక, ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X