Love Story నుంచి అదిరిపోయే అప్‌డేట్: రేవంత్, మౌనిక గురించి నాగ చైతన్య ట్వీట్

ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ జోష్‌తో కనిపిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. దీంతో ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఏక కాలంలో వరుసగా పలు చిత్రాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇక, ఇప్పటికే ఈ యంగ్ హీరో.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 'లవ్ స్టోరీ' అనే సినిమాలో నటించాడు. అన్ని హంగులనూ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు మాత్రం రాలేదు. దీంతో తరచూ ఇది టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.

నాగ చైతన్య - సాయి పల్లవి జంటగా నటించిన 'లవ్ స్టోరీ' మూవీ షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. అయితే, గత ఏడాది కరోనా లాక్‌డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా పడడంతో ఆ తర్వాత టాకీ పార్ట్ మొత్తాన్ని పూర్తి చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా కంప్లీట్ చేసేశారు. ఈ నేపథ్యంలోనే దీన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. ఈ మేరకు రిలీజ్ డేట్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. కానీ, మరోసారి కరోనా మహమ్మారి విజృంభించడంతో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రాలేకపోయారు. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు.

Naga Chaitanyas Love Story Theatrical Trailer on Sep 13th

'లవ్ స్టోరీ' మూవీని వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అయితే, అనుకోని పరిస్థితుల్లో అది కూడా సాధ్యం కాలేదు. దీంతో చిత్ర యూనిట్ ఈ మూవీని మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక, ఎన్నో ఆటంకాల తర్వాత ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, అనివార్య కారణాల వల్ల పలుమార్లు సినిమాను వాయిదా వేయాల్సి వచ్చిందని.. ఎప్పటికైనా మంచి ఔట్‌పుట్‌ను అందించాలనే వేచి చూశామని ఓ లేఖను కూడా విడుదల చేశారు.

ఇక, 'లవ్ స్టోరీ' మూవీ విడుదలకు సమయం ఆసన్నం అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ప్రకటనను హీరో అక్కినేని నాగా చైతన్య తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో 'రేవంత్, మౌనిక లవ్ స్టోరీ థియేట్రికల్ ట్రైలర్ సెప్టెంబర్ 13, ఉదయం 11.07 గంటలకు విడుదల కాబోతుంది. వేచి చూడండి' అంటూ పోస్ట్ పెట్టాడు. అలాగే, దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం అందులో షేర్ చేశాడు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

పూర్తి స్థాయి ప్రేమకథతో తెరకెక్కిన 'లవ్ స్టోరీ'లో అక్కినేని నాగ చైతన్య డ్యాన్స్ మాస్టర్‌గా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడి దగ్గర డ్యాన్స్ నేర్చుకునే అమ్మాయిగా సాయి పల్లవి నటిస్తుందట. ఇది విషాదాంతమైన ప్రేమకథతో తెరకెక్కినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక, దీని నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు భారీ స్థాయిలో స్పందన వచ్చింది. దీంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X