Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రాఘవేంద్రరావు నిర్మాణంలో నాగ శౌర్య మూవీ, ముగ్గురు హీరోయిన్లతో..
'ఓ బేబీ' మూవీలో సమంతకు జోడీగా నటించిన హీరో నాగ శౌర్య మరో సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సారి ఈ యంగ్ హీరో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నారట. ఈ సినిమా నిర్మించబోయేది కూడా మామూలు వ్యక్తి కాదు... తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా కీర్తి గడించిన కె రాఘవేంద్రరావు.
కె రాఘవేంద్రరావు న్యూ ప్రొడక్షన్లో తొలి చిత్రం నాగ శౌర్య హీరోగా రూపొందబోతోంది. ఇందులో మొత్తం మూడు లవ్ స్టోరీలు ఉంటాయట. అయితే మూడు లవ్ స్టోరీలను ముగ్గురు డిఫరెంట్ దర్శకులు డైరెక్ట్ చేయబోతున్నారని, ఈ మూడింటిని రాఘవేంద్రరావు పర్యవేక్షిస్తారని సమాచారం.
ఆల్రెడీ ఒక లవ్ స్టోరీని డైరెక్ట్ చేయడానికి క్రిష్ ఒప్పుకున్నారట. మరో ఇద్దరు డైరెక్టర్లు ఫైనలైజ్ కావాల్సి ఉంది. ఈ చిత్రానికి గోపీ మోహన్, బివిఎస్ స్రిప్టు అందించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు రాని ఒక కొత్త సబ్జెక్టుతో ఈ మూవీ ఉండబోతోందని తెలుస్తోంది.
ఇటీవల సినిమా షూటింగులో గాయపడ్డ నాగ శౌర్యను రాఘవేంద్రరావు ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. దీంతో అప్పుడే చాలా మందికి డౌట్ వచ్చింది. తన ప్రొడక్షన్లో నిర్మించబోయే తొలి మూవీలో నాగ శౌర్య హీరోగా నటిస్తుండటంతో ఆయనకు గాయమైన విషయం తెలిసి రాఘవేంద్రరావు కంగారు పడ్డారని, అందుకే ఇంటికి వచ్చి పరామర్శించారి తెలుస్తోంది.