Don't Miss!
- Sports రోహిత్‌పై వేటు వేయడానికి కారణమిదే- రాబిన్ ఉతప్ప
- News బోండా ఉమా భయం వెనుక - ఏం జరుగుతోంది..!!
- Finance Zomato: జొమాటోకు షాక్.. రూ. 11.81 కోట్ల పెనాల్టీ..!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Automobiles కొత్త మారుతి స్విఫ్ట్ బుకింగ్ ప్రైస్ ఎంతో తెలుసా? ఇక్కడ చూడండి!
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
‘వరుడు కావలెను’.. డబ్బింగ్ పనుల్లో రీతూ, నాగ శౌర్య బిజీ
యంగ్ హీరో నాగ శౌర్యకు ఇప్పుడు టైం ఏమీ బాగా లేదు. వరుసగా సినిమాలు బెడిసి కొడుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని ఇంకెన్నో అంచనాల నడుమ వచ్చిన అశ్వథ్థామ చిత్రం బోల్తా కొట్టింది. అలా ఇప్పుడు నాగ శౌర్య మళ్లీ తనకు అలవాటైన పాత్రలు చేస్తూనే ప్రయోగాలకు కూడా సిద్దమయ్యాడు. అలా నాగ శౌర్య చేతిలో ఇప్పుడు ఓ స్పోర్ట్స్ డ్రామా ఒకటి ఉంది. లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాలో కూడా నటిస్తున్నాడు.
లక్ష్య అంటూ విలువిద్యలో ఆరితేరిన పాత్రలో నాగ శౌర్య నటిస్తున్నాడు. ఆ మధ్య వదిలిన టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక వరుడు కావలెను అంటూ ప్రేమ, కుటుంబ కథా చిత్రంతోనూ పలకరించేందుకు రెడీ అవుతున్నాడు. లవర్ బాయ్‌గా, క్లాసీ లుక్కుతో అందరినీ మెప్పించేశాడు. ఈ మేరకు ఆ మధ్య వదిలిన చిన్న వీడియో అందరినీ కట్టిపడేసింది. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ఓ అప్డేట్ వచ్చింది.
పెళ్లి పనులు ఇలా మొదలయ్యాయ్ అంటూ తాము డబ్బింగ్ చెబుతున్న విషయాన్ని నాగ శౌర్య చెప్పుకొచ్చాడు. దర్శకురాలు లక్ష్మీ దగ్గరుండి మరీ హీరో హీరోయిన్ల చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు. త్వరలోనే టీజర్ రాబోతోందని చెప్పుకొచ్చారు. ఉగాది సందర్భంగా ఈ టీజర్‌ను వదలబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ టీజర్ కోసమే ఇప్పుడు డబ్బింగ్ పనులను మొదలుపెట్టేశారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.