HBD Naga Shaurya: కృష్ణ వ్రింద విహారి అంటోన్న యంగ్ హీరో.. ఫస్ట్ లుక్ అదిరిందిగా!

బ్యాగ్రౌండ్ లేకుండానే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి.. హ్యాండ్సమ్ లుక్స్, అదిరిపోయే యాక్టింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో చిన్న పాత్రలు చేసిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' మూవీతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఫస్ట్ సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం అందుకున్నాడతను. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, ఇందులో చాలా వరకూ అతడికి నిరాశనే మిగిల్చాయి. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన కథలతో విభిన్నమైన చిత్రాలు చేస్తున్నాడు.

కొంత కాలంగా వరుసగా పరాజయాలను చవి చూస్తూ వచ్చిన నాగశౌర్య రెండేళ్ల క్రితం 'అశ్వద్ధామ' అనే క్రైమ్ థ్రిల్లర్ మూవీని చేశాడు. ఇది హిట్ అవడంతో పాటు అతడిని హీరోగా మరో మెట్టుపై నిలబెట్టింది. దీంతో అతడు రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే గత ఏడాది లక్ష్మీ సౌజన్య అనే మహిళా దర్శకురాలు తెరకెక్కించిన 'వరుడు కావలెను' అనే సినిమాను చేశాడు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్య దేవర నాగవంశీ నిర్మించిన ఈ మూవీలో రితూ వర్మ హీరోయిన్‌గా చేసింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ చిత్రం అతడికి నిరాశనే మిగిల్చింది.

దీని తర్వాత నాగశౌర్య 'లక్ష్య' అనే సినిమాలో నటించాడు. దీన్ని ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాగశౌర్య అర్చరీ క్రీడాకారుడిగా నటించాడు. ఇందులో అతడు ఎనిమిది పలకల దేహంతో కనిపించాడు. భారత చలన చిత్ర చరిత్రలోనే అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా అయిన దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేసింది. కీరవాణి తనయుడు కాల భైరవ దీనికి సంగీతం అందించాడు. ఇది కూడా అనుకున్న స్థాయిలో ఆడలేదనే చెప్పాలి.

Naga Shauryas Krishna Vrinda Vihari Movie First Look Released

వరుస పరాజయాలతో సతమతం అయిన నాగశౌర్య ప్రస్తుతం మరో సినిమాను చేస్తున్నాడు. ఈరోజు అతడి పుట్టినరోజు. దీన్ని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రివీల్ చేశారు. ఇక, దీనికి 'కృష్ణ వ్రింద విహారి' అనే పేరు పెట్టారు. అలాగే, ఇందులో నాగశౌర్య ఫస్ట్ లుక్‌ను కూడా చూపించారు. నుదిటిన పొడవాటి బొట్టు పెట్టుకుని, చేతిలో రాగి చెంబు పట్టుకుని, మామిడి ఆకులతో నీళ్లు చల్లుతున్నట్లు అతడిని చూపించారు. దీంతో ఇందులో ఈ యంగ్ హీరో సాఫ్ట్ రోల్‌ను చేస్తున్నట్లు ఈ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ఇక, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'కృష్ణ వ్రింద విహారి' సినిమాను అనీష్ కృష్ణ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో నాగశౌర్యకు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో షెర్లీ సెతియా ఒకరు కాగా.. మరొక హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఇక, ఈ సినిమాను నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. దీనికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X