నాగ శౌర్య ‘లక్ష్య’ టీజర్ ఎప్పుడంటే?.. భలే ఫాస్ట్‌గా ఉన్నారే!!

నాగ శౌర్యకు ప్రస్తుతం టైం కలిసి రావడం లేదు. కొత్తగా ట్రై చేసినా కూడా ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. ఛలో తరువాత నాగ శౌర్యకు మళ్లీ హిట్ రాలేదు. కండలు పెంచి, మాస్ లుక్‌ ట్రై చేసి సస్పెన్స్ థ్రిల్లర్‌గా చేసిన అశ్వథ్థామ చిత్రం మిశ్రమ ఫలితాన్ని ఇచ్చింది. అలా తమ బ్యానర్‌లో తెరకెక్కించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతూ వచ్చాయి. అయినా సరే ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలన్న పట్టుదలను మాత్రం వీడలేదు.

అందుకే నాగశౌర్య ఈసారి స్పోర్ట్స్ డ్రామాను ఎంపిక చేసుకున్నాడు. లక్ష్య అనే సినిమా కోసం నాగ శౌర్య తన లుక్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. అలా నాగ శౌర్య జుట్టును,గడ్డాన్ని, బాడినీ పెంచేశాడు. ఏకంగా పది పలకల దేహం కోసం ట్రై చేశాడు. పాత్రను ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చూపించేందుకు టెన్ ప్యాక్స్ ట్రై చేశానని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ మూవీ షూటింగ్ సైలెంట్‌గా జరిగిపోతోంది.

Naga Shaurya lakshya Teaser On 22nd January

ఏకంగా ఇప్పుడు టీజర్ అప్డేట్‌ను కూడా ఇచ్చేశారు. జనవరి 22న లక్ష్య టీజర్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. సంక్రాంతి సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. లక్ష్యలో రొమాంటిక్ టచ్ కూడా ఉందని చెప్పనకనే చెప్పేశారు. ఇక జనవరి 22న ఉదయం పది గంటల 17 నిమిషాలకు ఈ టీజర్ విడుదల కాబోతోందని ప్రకటించారు. ఈ సినిమాను సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X