నాగ శౌర్య, మాళవిక నాయర్‌తో శ్రీనివాస్ అవసరాల చిత్రం
నాగసౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
మార్చి 2వ వారంలో చిత్రం షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కొద్ది రోజులలోనే ప్రకటిస్తామని ఈ చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.

నాగశౌర్య , మాళవిక నాయర్ కలిసి గతంలో 'కళ్యాణ వైభోగమే' చిత్రంలో నటించారు. నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ అవసరాల కాంబినేషన్లో వచ్చిన 'ఊహలు గుస గుస లాడే', 'జో అచ్యుతానంద' మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
తన సొంత బేనర్లో చేసిన 'ఛలో' మంచి విజయం అందుకోవడంతో నాగ శౌర్య... ఇదే బేనర్లోనే 'నర్తనశాల' చేశారు. అయితే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలైంది. దీంతో కథల ఎంపిక విషయంలో గ్యాప్ తీసుకుని ఆచితూచి ముందుకు సాగుతున్నారు.


Click it and Unblock the Notifications











