twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Naga Shaurya Wedding:ఆస్పత్రి బెడ్ నుంచి పెళ్లి పీటలపైకి.. నాగ శౌర్య ప్రీ వెడ్డింగ్ పిక్స్ వైరల్

    |

    టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు నాగ శౌర్య. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నాడు ఈ హీరో. ఇటీవల కృష్ణవ్రింద విహారి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాగ శౌర్య ఇటీవల పెళ్లి గురించి అధికారికంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పెళ్లి పనులతో బిజీగా ఉన్న నాగ శౌర్య సినిమా షూటింగ్స్ లో కూడా పాల్గొన్నాడు.

    రెస్ట్ లేకుండా వర్క్ చేయడంతో ఇటీవల సినిమా షూటింగ్ లో కళ్లు తిరిగి పడిపోయిన విషయం తెలిసిందే. డీహైడ్రేట్ కారణంగా కళ్లు తిరిగినట్లు వైద్యులు చెప్పడంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఇదిలా ఉంటే నాగ శౌర్య పెళ్లి సందడి మొదలైంది. ఆ వివరాళ్లోకి వెళితే..

    ఫైవ్ స్టార్ హోటల్ లో..

    యంగ్ హీరో నాగ శౌర్య ఇవాళ అంటే నవంబర్ 20 ఆదివారం పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. బెంగళూరుకు చెందిన అనూష మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు ఈ హీరో. ఇప్పటికే వివాహానికి సంబంధించిన పనులు ఘనంగా ఏర్పాటు చేశారు. వధువు, వరుడుల ఇరు కుటుంబ సభ్యులు నాగశౌర్య-అనూష వివాహం బ్రహ్మాండంగా జరిపేందుకు సిద్ధం అయ్యారు.

    అయితే వీరి వివాహమహోత్సవం బెంగళూరులోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరగనుంది. పెళ్లి వేడుకల్లో భాగంగా హల్దీ సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి. ప్రస్తుతం నాగ శౌర్య హల్దీ ఫంక్షన్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

    అనూషకు నాగ శౌర్య గోల్డ్ రింగ్..

    హల్దీ ఫంక్షన్ తర్వాత కాక్ టెయిల్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, సన్నిహితలు, స్నేహితులు పాల్గొన్నారు. ఈ హల్దీ వేడుకల్లో భాగంగా కాబోయే భార్య అనూషకు నాగ శౌర్య బంగారు ఉంగరాన్ని తొడిగాడు. కుటుంబసభ్యులు, వధూవరుల మిత్రుల సమక్షంలో ఈ వేడుక వైభవంగా జరిగింది.

    ప్రస్తుతం ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నాగ శౌర్య-అనూష జోడి బాగుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అలాగే అభినందనలు, ఆల్ ది బెస్ట్ అని తెలుపుతున్నారు.

    ఆస్పత్రిలో నాగ శౌర్య..

    ఆస్పత్రిలో నాగ శౌర్య..

    ఇక నాగ శౌర్య ఇటీవల కృష్ణ వ్రింద విహారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మిక్స్ డ్ టాక్ ను సొంతం చేసుకోగా హిట్స్, ప్లాప్స్ అంటూ చూసుకోకుండా సినిమాలపై ఫోకస్ పెడుతున్నాడు నాగ శౌర్య. ప్రస్తుతం సొంత బ్యానర్ లోనే సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఇటీవల ఐదారు రోజుల క్రితం షూటింగ్ స్పాట్ లో నాగ శౌర్య స్పృహ తప్పిపోవడంతో కుటుంబసభ్యులు ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించారు. డిహైడ్రేషన్ వల్ల కళ్లు తిరిగాయని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నాగ శౌర్య పెళ్లి పీటలు ఎక్కుతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Hero Naga Shaurya Getting Married With Software Employee Anusha Shetty And His Pre Wedding Photos Goes Viral In Social Media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X