Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
నర్తనశాల టీజర్: నాగశౌర్య 'గే' అంట.. హీరోయిన్ కవ్విస్తున్నా!
Recommended Video
యంగ్ హీరో నాగ శౌర్య నటిస్తున్న తాజా చిత్రం @ నర్తనశాల. ఛలో చిత్రంతో హిట్ అందుకున్న నాగ శౌర్య ఇకపై మంచి యూత్ ఫుల్ చిత్రాలపై దృష్టి పెట్టాడు. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నర్తనశాల చిత్రం తెరకెక్కుతోంది. కాశ్మీర. యామిని భాస్కర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు. యువతని మెప్పించే విధంగా టీజర్ ఉంది.
అమ్మాయిల మధ్యలోనే
అమ్మాయిల మధ్యలో స్టైలిష్ గా ఉండే కుర్రాడిగా నాగ శౌర్య నటిస్తున్నాడు. కానీ అమ్మాయిల పట్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పెళ్లి చేసుకోవాలని నాగశౌర్యని ఒత్తిడి చేసే తండ్రి పాత్రలో నటుడు శివాజీ రాజా కనిపిస్తున్నాడు.
అమ్మయిలా పెంచితే
చిన్నప్పటి నుంచి అమ్మాయిలా పెంచితే ఆ ఫీలింగ్స్ ఎలా వస్తాయి అనే సరదా సంభాషణ ఆకట్టుకునే విధంగా ఉంది. హీరోయిన్లు అందాలతో ఎంత కవ్వించినా నాగశౌర్యకు ఫిలింగ్ రావు. అక్కడే అసలు మతలబు ఉంది. నా కొడుకు గే నా అంటూ శివాజీ రాజా నిద్రలోనుంచి ఉలిక్కిపడి లేస్తాడు.
నాగశౌర్య గే ఏంటి
నాగ శౌర్య గే పాత్రలో నటించడం ఏంటి. అందులో ఉన్న రహస్యం ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే. టీజర్ కలర్ ఫుల్ గా ఉంటూ యువతకి ఆకట్టుకునే విధంగా ఉంది.
యాక్షన్ కూడా
ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు కూడా బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ షాట్ లో నాగశౌర్య నెత్తురు కక్కుతూ కనిపిస్తున్నాడు.అంచనాలకు అనుగుణంగా ఉంటె నాగ శౌర్య ఖాతాలో మరో హిట్టు పడ్డట్లే.