షాకింగ్ లుక్‌లో నాగ శౌర్య.. జిమ్‌లో తెగ కష్టపడుతున్న హీరో
'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య.. ఆ తరవాత అన్నీ ప్రేమకథలు, కుటుంబ కథాచిత్రాలే చేస్తూ వచ్చాడు. మధ్యలో 'కణం'లాంటి భిన్న సినిమాను చేసినా అంత ఆదరణకు నోచుకోలేదు. ప్రస్తుతం మరో విభిన్న కథాంశంతో తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు. సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌లో ఛలో వంటి హిట్ సినిమా రాగా.. మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు 'అశ్వథ్థామ' అంటూ రాబోతోన్నాడు.
ఇటీవలే ఈ మూవీ నుంచి కాన్సెప్ట్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ పోస్టర్‌లో నాగశౌర్య లుక్‌కి మంచి మార్కులు పడ్డాయి. అదేదో క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించేలా కిడ్నాప్, చేజింగ్‌లాంటి సీన్లతో బాగానే హైప్ క్రియేట్ చేసింది. అయితే అదలా ఉంటే, తాజాగా నాగశౌర్య ట్విట్టర్‌లో పెట్టిన ఒక ఫొటో సినిమాపై అంచనాలను బాగా పెంచేస్తోంది. ఈ ఫొటోలో నాగశౌర్య కండలు తిరిగిన బాడీతో రాంబోలా కనిపిస్తున్నాడు.

ఇప్పటి వరకు చాక్లెట్ బోయ్‌లా కనిపించిన నాగశౌర్య మొదటిసారి ఇలాంటి లుక్‌లో కనపడి అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. జిమ్‌లో కసరత్తులు చేసేటప్పుడు తీసిన ఈ ఫొటోను ట్వీట్ చేసిన నాగశౌర్య.. 'ఏది రైటో అదే చేయండి, ఈజీగా ఉండేది కాదు'అంటూ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, ఆరోగ్యంగా ఉండండి, వర్కౌట్లు చేయండి అంటూ హ్యాష్ ట్యాగ్‌లు పెట్టాడు.
ప్రస్తుతం నాగ శౌర్యకు సంబంధించిన ఈ పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోసాని కృష్ణమురళి, సత్య, విజయ ప్రకాష్, కిషోర్, ఎం.ఎస్. భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











