అదరగొడుతున్న ‘అశ్వథ్థామ’.. ఓ రేంజ్ రెస్పాన్స్.. టాప్ ప్లేస్‌లో నాగశౌర్య
ఈ మధ్యకాలంలో డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. విలక్షణ పాత్రలు ఎంచుకుంటూ టాలీవుడ్ పై తనదైన మార్క్ వేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన నటిస్తున్న తాజా సినిమా 'అశ్వథ్థామ'. రమణ తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఐరా క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. చిత్రంలో నాగశౌర్య సరసన మెహరీన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. సమంత విడుదల చేసిన ఈ టీజర్ క్లాస్, మాస్ ఆడియన్స్ అందరికీ చేరువైంది. ఆసక్తి రేకెత్తించేలా కట్ చేయబడిన సన్నివేశాలు సీఎంఎంపై హైప్ క్రియేట్ చేశాయి. 'ఎలా ఉంటాడో కూడా తెలియని ఒక రాక్షసుడు..వాడికి మాత్రం తెలిసిన ఒక రహస్యం' అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆన్‌లైన్ వేదికలపై భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

ప్రస్తుతం 'అశ్వథ్థామ' టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. అలాగే 5 మిలియన్ల డిజిటల్ వ్యూస్‌కు చేరువలో ఉంది. ఈ మేరకు ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. టీజర్‌ను బట్టి చూస్తే క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందని స్పష్టమవుతోంది. ప్రస్తుతం 'అశ్వథ్థామ' పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జనవరి 31న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది చిత్రయూనిట్.


Click it and Unblock the Notifications











