For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Lakshya OTT: నెల కూడా తిరగకముందే ఓటీటీలోకి లక్ష్య.. ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే!

  |

  బ్యాగ్రౌండ్ లేకపోయినా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో చాలా మంది సక్సెస్ అవడంతో పాటు స్టార్ స్టేటస్‌ను సొంతం చేసుకున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్‌లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో యంగ్ హీరో నాగశౌర్య ఒకడు. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్నాడు.

  Akhanda 25 Days Collections: ఒకే రోజు రెండు రికార్డులు కొట్టిన అఖండ.. 25 రోజుల్లోనే అన్ని కోట్లా!

  యంగ్ హీరో నాగశౌర్య కొంత కాలంగా విలక్షణమైన చిత్రాలతో ఎన్నో ప్రయోగాలు చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య 'అశ్వద్ధామ'తో హిట్ కొట్టాడు. ఇక, ఇటీవలే 'లక్ష్య' అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారత చలన చిత్ర చరిత్రలోనే అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా అయిన దీన్ని ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించాడు. ఈ మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవు. కానీ, దీని నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

  Naga Shauryas Lakshya Movie Streaming on January 7th in Aha

  'లక్ష్య' మూవీపై అందరిలో ఆసక్తి పెరిగిపోవడంతో బిజినెస్ మంచిగానే జరిగింది. దీంతో ఈ సినిమా నాగశౌర్య కెరీర్‌లోనే భారీ స్థాయిలో విడుదలైంది. ఇక, ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ చిత్రం క్లీన్ హిట్ స్టేటస్‌ను దక్కించుకోవాలి అంటే రూ. 6.60 కోట్ల వరకు షేర్‌ను రాబట్టాలి. కానీ, ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం అన్ని ప్రాంతాల్లో కలుపుకుని కేవలం రూ. 2.06 కోట్ల షేర్‌ను మాత్రమే వసూలు చేసింది. దీంతో ఈ సినిమాకు రూ. 4.42 కోట్ల నష్టాలు వచ్చాయి. ఫలితంగా నాగశౌర్య ఖాతాలో ఈ ఏడాది మరో పరాజయం వచ్చి చేరింది.

  హాట్ సెల్ఫీ వీడియో వదిలిన శ్రీరెడ్డి: బట్టలన్నీ తీసి పడేసి.. బాగా పెరిగిపోయాయి అంటూ!

  ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన 'లక్ష్య' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌పై తాజాగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. దీనిపై ప్రకటనను వదిలింది. నాగశౌర్య నటించిన ఈ సినిమాను జనవరి 7 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సదరు సంస్థ తాజాగా అనౌన్స్ చేసింది. అంటే ఇది విడుదలై నెల రోజులు కూడా గడవక ముందే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ మేరకు ఆహా సంస్థ సోషల్ మీడియాలో ఖాతాలో ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. దీంతో ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్లంతా ఓటీటీలో చూడడానికి రెడీ అవుతున్నారు.

  ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగశౌర్య అర్చరీ క్రీడాకారుడిగా నటించాడు. ఇందులో అతడు ఎనిమిది పలకల దేహంతో కనిపించాడు. భారత చలన చిత్ర చరిత్రలోనే అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా అయిన దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేసింది. కాల భైరవ దీనికి సంగీతం అందించాడు.

  English summary
  Young Hero Naga Shaurya Did Lakshya Movie Under Dheerendra Santhossh Jagarlapudi Direction. This Movie Streaming on January 7th in Aha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X