Lakshya Trailer: అలాంటి వాడితో పందెం ప్రమాదం.. 8 ప్యాక్‌తో అదరగొట్టిన నాగశౌర్య

అదిరిపోయే నటన.. హ్యాండ్సమ్ లుక్స్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని ముందుకు వెళ్తున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో హీరోగా పరిచయం అయిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఇరవై సినిమాలను పూర్తి చేసుకున్నాడు. అలాగే, లవర్ బాయ్ ఇమేజ్‌ నుంచి బయటకు వచ్చేందుకు సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇలా 'ఛలో' నుంచి పంథాను మార్చుకున్న అతడు.. కథలను రాయడంతో పాటు నిర్మాతగానూ మారాడు. ఇక, ఇప్పుడు చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు.

నాగశౌర్య ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో 'లక్ష్య' ఒకటి. భారత చలన చిత్ర చరిత్రలోనే ఆర్చరీ నేపథ్యంతో రూపొందుతోన్న మొట్టమొదటి చిత్రం ఇది. ఈ మూవీని ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే డైరెక్టర్ వినూత్నంగా ప్లాన్ చేసి ప్రతి శుక్రవారం ఓ అప్‌డేట్ ఇస్తూ వచ్చారు. ఇక, ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు.

 Naga Shauryas Lakshya Movie Trailer Released

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లక్ష్య' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను వదిలారు. ఇందులో ఆర్చరీ గేమ్‌ను పరిచయం చేయడంతో పాటు హీరో క్యారెక్టర్‌ను కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇక, తన కెరీర్‌ను సాగిందచేందుకు హీరో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? అతడు లక్ష్యాన్ని సాధించాడా లేదా? నేషనల్ ప్లేయర్ అవ్వాల్సిన వాడు అబద్ధాలు ఎందుకు చెప్పాలి వచ్చింది? అనేవి ఇందులో చూపించారు.

'లక్ష్య' ట్రైలర్‌లో'వాడు నిన్ను తప్పించి గెలవాలనుకున్నావు.. నువ్వు తప్పుడు దారిలో గెలవాలని అనుకున్నావు'.. 'పైన కూర్చోబెట్టేది మీరే.. అక్కడి నుంచి కిందకు తోసేసేదీ మీరే'.. 'పడి లేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం'.. 'తప్పు చేసి గెలవగలనేమో కానీ, అబద్ధం చెప్పి బతకలేను సార్' అనే డైలాగ్‌లు పేలిపోయాయి. మరీ ముఖ్యంగా డైరెక్టర్ సంతోష్ చేసిన ఈ ట్రైలర్ కట్ అద్భుతంగా ఉంది. ఇందులోనే అతడి దర్శకత్వ ప్రతిభ కనిపించింది. మొదటి చిత్రమే అయినా దీన్ని మలచిన విధానాన్ని మెచ్చుకోవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ ట్రైలర్‌తో దర్శకుడు తన సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశారు.

స్పోర్ట్స్ బేస్‌డ్ ఎమోషనల్ డ్రామాగా రూపొందిన 'లక్ష్య' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో యంగ్ హీరో నాగశౌర్య 8 ప్యాక్ బాడీతో కనిపించిన విధంగా అప్పట్లోనే ఔరా అనిపించింది. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో నాగశౌర్య ఆర్చరీ ఆటగాడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం అతడు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X