For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Lakshya Twitter Review: లక్ష్యకు ఊహించని టాక్.. ఫస్టాఫ్ అలా సెకెండాఫ్ ఇలా.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

  |

  స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు హ్యాండ్సమ్ గాయ్ నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో పలు చిత్రాల్లో నటించిన అతడు.. 'ఊహలు గుసగుసలాడే' చిత్రంతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఈ సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. అంతేకాదు, లవర్ బాయ్ ఇమేజ్‌ను సైతం సొంతం చేసుకున్నాడు. దీంతో ఆ తర్వాత అదే తరహా సినిమాల్లో నటించాడు. అయితే, ఇవి అతడికి వర్కౌట్ కాలేదు. దీంతో పంథాను మార్చుకున్న ఈ యంగ్ హీరో.. విలక్షణమైన చిత్రాలతో ఎన్నో ప్రయోగాలు చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే ఆ మధ్య 'అశ్వద్ధామ'తో హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు 'లక్ష్య' అంటూ వస్తున్నాడు. మరి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  ‘లక్ష్య' అంటూ వచ్చిన నాగశౌర్య

  ‘లక్ష్య' అంటూ వచ్చిన నాగశౌర్య

  నాగశౌర్య హీరోగా ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించిన చిత్రమే 'లక్ష్య'. భారత చలన చిత్ర చరిత్రలోనే అర్చరీ నేపథ్యంతో రూపొందిన మొట్టమొదటి సినిమా అయిన దీన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించింది. ఈ చిత్రంలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేసింది. కాల భైరవ దీనికి సంగీతం అందించాడు.

  Bigg Boss Elimination: ఒక్క ఎపిసోడ్‌తో మారిన ఓటింగ్.. టాప్‌లో అతడే.. చివర్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్
  https://telugu.filmibeat.com/television/bigg-boss-14th-week-elimination-maanas-and-rj-kajal-enter-into-danger-zone-105270.html

   అంచనాలు పెంచేసిన అప్‌డేట్స్

  అంచనాలు పెంచేసిన అప్‌డేట్స్

  స్పోర్ట్స్ బేస్‌డ్ డ్రామాగా వచ్చిన 'లక్ష్య' మూవీపై ఆరంభంలో అంచనాలు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ, ఈ చిత్రం నుంచి ఏది విడుదలైన భారీ రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు రికార్డు వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో నాగశౌర్య నటించిన ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి.

   బిజినెస్ కూడా భారీగా... గ్రాండ్‌గా

  బిజినెస్ కూడా భారీగా... గ్రాండ్‌గా

  నాగశౌర్యకు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా మార్కెట్ లేదు. అయినప్పటికీ 'లక్ష్య' మూవీపై అంచనాలు ఉండడంతో హక్కులకు పోటీ ఏర్పడింది. దీంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మంచి బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఒక్క యూఎస్‌లోనే దాదాపు 120 స్క్రీన్లలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

  హీరోయిన్ బాత్ వీడియో షేర్ చేసిన వర్మ: దాని కంటే హాట్‌గా ఉన్నావ్.. ఫారెస్ట్ ఎక్కడ అంటూ!

  ‘లక్ష్య' మూవీకి ఊహించని టాక్

  ‘లక్ష్య' మూవీకి ఊహించని టాక్

  నాగశౌర్య - కేతిక శర్మ నటించిన 'లక్ష్య' మూవీ స్పోర్ట్స్ బేస్‌డ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శితం అయిపోయాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంత మంది ఈ చిత్రం చాలా బాగుందని కామెంట్లు చేస్తుండగా.. మరికొందరు మాత్రం ఏవరేజ్ అంటున్నారు.

   ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా ఉంది

  ఫస్టాఫ్ ఇలా సెకెండాఫ్ అలా ఉంది

  'లక్ష్య' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే ఫస్టాఫ్ మొత్తం కమర్షియల్ పంథాకు దూరంగా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంతో సాగిపోతుందట. ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఇది నిరాశనే మిగుల్చుతుందట. సెకెండాఫ్ కూడా అదే పంథాలో సాగుతుందని అంటున్నారు. హీరో మళ్లీ గేమ్‌ మొదలు పెట్టి ఇండియాకు మెడల్ అందించడంతో సినిమా ముగుస్తుందట.

  Ashu Reddy Pregnant: తల్లి కాబోతున్న అషు.. పిచ్చ కొట్టుడు కొట్టిన తల్లి.. అలా బయటకు వచ్చిన వీడియో

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఎంటి?

  సినిమా ప్లస్‌లు.. మైనస్‌లు ఎంటి?

  'లక్ష్య' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో నాగశౌర్య నటన, ఎమోషనల్ సన్నివేశాలు, బ్యాగ్రౌండ్ స్కోర్ దీనికి ప్లస్ అని చెబుతున్నారు. అయితే, ఎంటర్‌టైన్‌మెంట్ లేకపోవడం, ఆర్చరీ నేపథ్యంతో వచ్చే సన్నివేశాలు తేలిపోవడం, కొన్ని సీన్స్ ముందే ఊహించే విధంగా ఉండడం వంటివి సినిమాకు మైనస్‌గా మారాయని అంటున్నారు.

  Recommended Video

  Akhanda Movie టార్గెట్.. | Naga Chaitanya మాస్ లో క్లాస్ ! || Filmibeat Telugu
  మొత్తంగా ఎలా లక్ష్య ఎలా ఉంది?

  మొత్తంగా ఎలా లక్ష్య ఎలా ఉంది?

  ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. నాగశౌర్య నటించిన 'లక్ష్య' మూవీ పూర్తిగా ఆర్చరీ నేపథ్యంతో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. కమర్షియల్ అంశాలకు దూరంగా, వాస్తవికతకు దగ్గరగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారట. అయితే, కొన్ని సన్నివేశాలు తేలిపోవడంతో ఫీల్ మిస్ అవుతుందని సినిమాను చూసిన వాళ్లంతా అంటున్నారు.

  English summary
  Tollywood Young Hero Naga Shaurya Did Lakshya Movie Under Dheerendra Santhossh Jagarlapudi Direction. Lets See This Movie Twitter Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X