Naga Shaurya Update: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ప్రకటించారు
ప్రస్తుతం ఉన్న యువ హీరోల్లో నాగశౌర్య డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్నాడు. సినిమా సినిమాకు తన లోని టాలెంట్ బయటపెడుతూ స్టార్ హీరో రేస్‌లో పడిపోయాడు నాగశౌర్య. యూత్ ఆడియన్స్‌లో క్రేజీ హీరోగా గుర్తింపు పొందిన ఈయన ఇటీవలే ఓ బేబీ సినిమాలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగశౌర్య తాజాగా మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు.
ఈ మధ్యకాలంలో విభిన్న కథా చిత్రాలను నిర్మిస్తూ వస్తోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్. సరికొత్త కథాంశాలతో కూడిన కథలను తెరకెక్కిస్తూ పాపులారిటీ తెచ్చుకుంటున్న ఈ బ్యానర్ తాజాగా ఈ బ్యానర్ తన 8వ చిత్రాన్ని ప్రకటిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఈ సినిమాలో యంగ్ హీరో నాగశౌర్య హీరోగా నటిస్తున్నాడని పేర్కొంటూ ట్వీట్ చేశారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా ద్వారా 'లక్ష్మీ సౌజన్య' అనే మహిళా దర్శకురాలిగా పరిచయమవుతోంది. చిత్రానికి సంబంధించిన ఇతర తారాగణం .. సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే ఆ వివరాలను ప్రకటించనున్నారు. అక్టోబర్ నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టి, వచ్చే ఏడాది మే నెలలో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు.


Click it and Unblock the Notifications