నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ నుంచి రొమాంటిక్ పోస్టర్: అదిరిపోయిన మొదటి సర్‌ప్రైజ్

అదిరిపోయే లుక్‌తో పాటు అద్భుతమైన నటనతో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో నాగశౌర్య. ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన అతడు కెరీర్ ఆరంభంలోనే 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో భారీ హిట్‌ను అందుకున్నాడు. అదే సమయంలో లవర్ బాయ్ ఇమేజ్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. అప్పటి నుంచి హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే పలు విజయాలను కూడా అందుకున్నాడు. ఇక, ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలను ఏక కాలంలో చేస్తున్నాడు.

ప్రస్తుతం నాగశౌర్య నటిస్తోన్న చిత్రాల్లో 'లక్ష్య' ఒకటి. భారత చలన చిత్ర చరిత్రలోనే ఆర్చరీ నేపథ్యంతో రూపొందుతోన్న మొట్టమొదటి సినిమా ఇది. ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తైంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే దీని నుంచి ప్రతి శుక్రవారం ఓ అప్‌డేట్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్‌తో అప్‌డేట్లను ఇస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగానే తాజాగా ఓ అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు.

Naga Shauryas Lakshya Romantic Kiss Poster Released

నాగశౌర్య 'లక్ష్య' మూవీ నుంచి తాజాగా చిత్ర యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో హీరోయిన్ కేతిక శర్మ.. అతడికి ముద్దు పెడుతోంది. ఎంతో లవ్‌లీగా ఉన్న ఈ పోస్టర్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఇది కొద్ది సమయంలోనే విపరీతంగా వైరల్ అయిపోయింది. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో నాగశౌర్య ఆర్చరీ ఆటగాడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా 8 పలకల దేహాన్ని సంపాదించుకున్నాడు.

ఇక, ఇందులో జగపతి బాబు కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అదిరిపోయే స్పందన కూడా వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. 'లక్ష్య' మూవీని క్రీడా శాఖలో ఉన్న లోటుపాట్లను ఎత్తి చూపుతూ సందేశాత్మకంగా తెరకెక్కించారు. ఈ విషయాన్ని టీజర్‌లో బాగా హైలైట్ చేసి చూపించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇందుకోసం రిలీజ్‌ డేట్‌ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నారు దర్శక నిర్మాతలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X