అనుష్కతోనే పోటీనా.. ఆ యంగ్ హీరో నిలబడగలడా?
ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య లాంటి కూల్ చిత్రాలతో మంచి నటుడిగా పరిచయమైన నాగశౌర్య.. అటుపై ఛలో లాంటి కామెడీ, లవ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. మధ్యలో ఎన్ని సినిమాలు చేసినా అంతటి విజయాన్ని చూడలేదు ఆ యంగ్ హీరో. నిర్మాతగానూ ఛలో చిత్రం హీరోకు మంచి లాభాలనే తీసుకొచ్చింది. అయితే ఛలో తరువాత మళ్లీ ఆ రేంజ్ సక్సెస్ కొట్టని నాగ శౌర్య.. మరో డిఫరెంట్ కథతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు.
'అశ్వథ్థామ' అంటూ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసి అంచనాలను పెంచేశాడు. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోన్న ఈ చిత్రంలో నాగ శౌర్య యాక్షన్ సీన్స్ కాస్త ఎక్కువగానే చేసినట్టు తెలుస్తోంది. ఈ మూవీ చాక్లెట్ బాయ్‌లా ఉన్న నాగ శౌర్య.. కండలు పెంచేసి ర్యాంబోలా తయారయ్యాడు. ఈ సినిమా కోసం తన శరీరాకృతిని మార్చుకునేందుకు ఈ యంగ్ హీరో చాలానే కష్టపడ్డట్టు కనిపిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ వచ్చేసింది.

ఈ సినిమాను జనవరి 31 వ తారీఖున విడుదల చేస్తున్నామంటూ ఫిలిం మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ డేట్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఇదే డేట్‌ను కొన్ని రోజులు క్రితం అనుష్క నిశ్శబ్దం కోసం కోన వెంకట్ బుక్ చేసేశాడు. నిశ్శబ్దం జనవరి 31 రాబోతోందని తెలిసినా.. అశ్వథ్థామను కూడా అదే రోజు లైన్లో పెట్టేశారు. మరి అనుష్కను తట్టుకుని నాగశౌర్య తట్టుకోగలడా? లేదా? అన్నది చూడాలి.


Click it and Unblock the Notifications











