ఆమెకు సినిమానే ప్రపంచం.. వదిలివెళ్లడం దురదృష్టకరం.. హీరో నాగశౌర్య
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల ఇకలేరు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆమె బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ విజయ నిర్మల మరణించారు. ఆమె వయసు 73 సంవత్సరాలు. విజయ నిర్మల మృతి వార్త సినీ వర్గాలు, అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. విజయ నిర్మల కుటుంబానికి పలువురు సినీ, వ్యాపార, ఇతర పరిశ్రమల ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య తన సంతాప ప్రకటనలో...
ఓక వ్యక్తి గురించి దశాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్యక్తి చేసిన పని మాత్రమే కాదు వారి గుణం, స్వభావం. మూవీ ఆర్టిస్ట్ అసోసియెషన్ కి తనవంతు సహాయన్ని ఇప్పటికి శ్రీమతి విజయనిర్మల గారు అందిస్తున్నారనే వార్త నా హ్రుదయంలో బాగా నాటుకు పోయింది. దర్శకురాలుగా సినిమాలు చేయటమే కాకుండా పేద కళాకారులకి సహయం చేసే గొప్ప లక్షణం తన సొంతం..ఛలో చిత్రం లో నరేష్ గారితో నటించాను. విజయనిర్మల గారి గురించి చాలా అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా సినిమా ఇదే ప్రపంచంగా వుండేవారట..

ప్రతి వారం ఏ సినిమా విడుదలయ్యింది. వాటి ఫలితాలు ఎలా వున్నాయనే డిస్కషన్ శ్రీమతి విజయనిర్మల గారితో వుండేదట అంతలా సినిమా ని ప్రేమించే వ్యక్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అందర్ని ఇలా వదిలి వెళ్ళి పోవటం చాలా దురదృష్టకరం.. శ్రీమతి విజయనిర్మల గారి ఆత్మకి శాంతి కలగాని కొరుకుంటున్నాను. అలాగే సూపర్‌స్టార్ కృష్ణ గారికి, నరేష్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని నాగశౌర్య ఓ ప్రకటనలో వెల్లడించారు.


Click it and Unblock the Notifications











