పవన్ కళ్యాణ్ సినిమాను గుర్తు చేస్తున్న నాగశౌర్య కొత్త మూవీ టైటిల్!

ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ శౌర్య హీరోగా నటించే ఈ చిత్రానికి 'పలానా అబ్బాయి పలానా అమ్మాయి' అనే టైటిల్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.

'పలానా అబ్బాయి పలానా అమ్మాయి' చిత్రం రొమాంటిక్ డ్రామాగా రూపొందుతోందని తెలుస్తోంది. ఈ చిత్రంలో నాగ శౌర్య సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించబోతోంది. దాసరి ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి.

Naga Shourya next movie title ‘Palana Abbayi Palana Ammayi’

'పలానా అబ్బాయి పలానా అమ్మాయి' అనే టైటిల్... పవన్ కళ్యాణ్ మొదటి సినిమా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా టైటిల్‌ను గుర్తు చేసే విధంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెల్లోనే షూటింగ్ ప్రారంభించేందుకుప్లాన్ చేస్తున్నారు.

శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద రెండు చిత్రాల్లోనూ నాగ శౌర్య నటించారు. ఇపుడు మూడో సినిమాలో కూడా అతడినే హీరోగా ఎంచుకోవడం గమనార్హం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X