ఢిఫెరెంట్ సినిమాలు చేయాలంటే భయం.. కానీ పలాస 1978తో ధైర్యం వచ్చింది..

నూతన తారలు రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పలాస 1978'. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. విడుదలకు ముందే ఇండస్ట్ర్రీ లో కొత్తతరహా సినిమా గా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా

మధురాశ్రీధర్ మాట్లాడుతూ:
'ఈ సినిమా టీజర్, ట్రైలర్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కరుణ్ కుమార్ గారు ఈ ట్రైలర్ బాగా నచ్చింది. మార్చ్ 6 కోసం ఎదురుచూస్తున్నాను. రఘుకుంచె కు జానపదాల మీద ఉన్న ప్రేమ తెలుసు. అదే ఈ సినిమాలో కూడా కనిపించింది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను' అన్నారు.

 Naga Shourya: Palasa 1978 will become best movie

హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ:
'పలాస గురించి తెలుసుకున్నప్పుడు ఈ సినిమా నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అలాగే మనస్ఫూర్తిగా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు తనదైన మార్క్ ని తెలుగు సినిమా పై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘు గారు ఇచ్చిన 'పలాస మీద వచ్చిన పాట' చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను. ' అన్నారు.

హీరో నాగశౌర్య మాట్లాడుతూ:
'పలాస 1978 నేను చూసాను. చాలా ధైర్యంగా చెబుతున్నాను. ఆ కాలంలోకి తీసుకెళ్ళి కూర్చో బెట్టారు. దర్శకుడు కరుణ కుమార్ గారు ఒక అద్భుతం చేసారు. పెద్ద షావుకారు పాత్ర చేసిన జనార్దన్ గారికి నేను ఫిదా అయ్యాను. చిన్న షావుకారు గా రఘు కుంచె గారు చాలా బాగా చేసారు. టాలెంట్ చాలా చోట్లు ఉంటుంది. కానీ వాటిని 'పలాస 1978' షో కేసే చేసారు దర్శకుడు. ఇలాంటి కథలు చేయాలని ఉన్నా లోపల చాలా భయం ఉంటుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు చాలా ధైర్యం వచ్చింది. ఇలాంటి కథలు నిర్మించాలంటే నిర్మాతకు చాలా థైర్యం ఉండాలి. కొడుకు హీరో గా ఉన్నా కూడా సినిమా నే ప్రేమించి సినిమాను నిర్మించారు నిర్మాత ప్రసాద్ గారు. నక్షత్ర చాలా బాగా నటించింది. రఘు చిన్నపటి నుండి తెలసు. అతని లైఫ్ స్టైయిల్ నాకు తెలుసు..కానీ పూర్తి భిన్నమైన పాత్రలో 'పలాస' లో కనిపించి నన్న సర్ ప్రైజ్ చేసాడు. అందరికీ ఆల్ ద బెస్ట్ ' అన్నారు.

 Naga Shourya: Palasa 1978 will become best movie

హీరోయిన్ నక్షత్ర మాట్లాడుతూ:
'మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్. నేను రాజ్ దూత్ తో ఇంట్రడ్యూస్ అయ్యాను. నా కెరియర్ స్టార్టింగ్‌లో ఇలాంటి రోల్ దొరకడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా చిన్న జర్నీగా స్టార్ట్ అయిన మా సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవడం చాలా సంతోషంగా ఉంది. దర్శకుడు కరుణ గారు కొత్త ప్రయత్నం చేస్తున్నారు అనుకున్నాం కథ నచ్చి ఈ ప్రాజెక్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. మా దర్శకుడు ప్రతి పాత్రను చాలా సహాజంగా తీర్చి దిద్దారు. ఒక నటిగా లక్ష్మి పాత్ర నాకు జీవితాంతం గుర్తిండిపోతుంది. ' అన్నారు.

దర్శకుడు కరుణ్ కుమార్ మాట్లాడతూ:
' పలాస నా మొదటి సినిమా చేద్దామనుకోలేదు. అయినా కొత్త తరహా కథలు కావాలని తమ్మారెడ్డి భరద్వాజ గారు నా నుండి ఈ కథను ఎంచుకున్నందుకు కృతజ్ఞతలు.. నిర్మాత ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.. నేను ఈ వేదికను ఈ ప్రయాణంలో తొడు నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఇది నా జీవితంలో చాలా ఎమోషన్ జర్నీ ఈ సినిమా నమ్మిన ప్రసాద్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారినిక నేను ఎప్పటికీ రుణ పడి ఉంటాను' అన్నారు.

మ్యూజిక్ దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ:
' నా రచయిత లు బాస్కర బట్ల రవికుమార్ కి, లక్ష్మీ భూపాల్ గారికి ధన్యావాదాలు. నా టీంకి ధన్యవాదాలు. నేను నటుడిగా మారదాం అనుకోలేదు.. కానీ దర్శకుడు కరుణ కుమార్ గారు నన్ను కన్విన్స్ చేసారు. రెండు పాత్రలు చేయాలని కాస్త ఆలోచిస్తుంటే దర్శకుడు నాకు కావాల్సిన టైం ఇచ్చి నన్ను ప్రోత్సహించారు. ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర నేను చేయడం నాకు ఛాలెంజ్ గా అనిపించింది. అల్లు అరవింద్ గారు, సుకుమార్ గారు నా నటనను మెచ్చుకుంటుంటే చాలా సంతోషం పడ్డాను. ఈ జర్నీ లో నాకు తోడు నా నిలిచిన అందరికీ థ్యాంక్స్ ' అన్నారు.

హీరో రక్షిత్ మాట్లాడుతూ:
'ఈ సినిమా నాకు చాలా స్పెషల్ ..నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్.. కరుణ్ కుమార్ గారు స్టోరీ చెప్పేదాకా ఇలాంటి కథలు, మనుషులు నాకు తెలియదు.. ఒక పద్దెనిమిది యేళ్ళ నుండి 60 యేళ్ళ వృద్దుడి వరకూ జర్నీ ఉంటుంది. ఈ సినిమాకి డైలాగ్స్ కి క్లాప్ప్ కొడతారు.. రఘుకుంచె గారు మా నటనను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవల్ కి తీసుకెళ్ళారు. ఇలాంటి తండ్రి దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఈ సినిమా అందరికీ మంచి ఎక్స్ పీరియన్స్‌గా మిగులుతుంది' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X