నాగ శౌర్యకి ఇంత క్రేజ్ ఉందా.. కొత్త సినిమాతో రికార్డ్ బ్రేక్!
స్టార్ హీరోల రేంజ్ లో కాకపోయినా నాగ శౌర్య కూడా టాలీవుడ్ లో తనకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది అంటే సినిమా చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు ముందుకు వస్తారు. ఛలో సినిమాతొ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ హీరో ఆ తరువాత మళ్ళీ ఆ రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు.
మొన్న రిలీజైన అశ్వద్ధామ సినిమా పరవాలేదు అనిపించే విదంగా పాజిటివ్ టాక్ అందుకుంది. ఇకపోతే థియేటర్స్ లో ఈ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోయినప్పటికి మినీ స్క్రీన్ పై మాత్రం సాలీడ్ హిట్ గా నిలిచింది. అశ్వద్ధామ రీసెంట్ గా ఒక చానెల్ లో మొదటిసారి టెలికాస్ట్ అవ్వగా.. ఊహించని TRP రేటింగ్ అందుకుంది. నాగ శౌర్య సినిమా మొదటి సారి 9.10 టీఆర్పీని అందుకొవడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది.

నిజానికి నాగ శౌర్యకి ఈ రేంజ్ లో క్రేజ్ ఉందని ఎవరు ఊహించలేదు. ఫ్యామిలీ ఆడియెన్స్ లో మనోడికి మంచి ఫాలోయింగ్ ఉందని అర్ధమవుతోంది. ఇక అశ్వద్ధామ అసలు కథను రాసింది నాగ శౌర్య. రైటర్ గా కూడా మంచి టాలెంట్ ఉందని నిరూపించుకున్నాడు. ఇక ప్రస్తుతం సుకుమార్ ప్రొడక్షన్ లో అలాగే మరో రెండు సినిమాలతో నాగ శౌర్య బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











