‘లక్ష్య’ కోసం నాగశౌర్య స్టన్నింగ్ ప్లాన్: వారానికి ఒకటి అంటూ సరికొత్త ప్రయోగం
హ్యాండ్సమ్ లుక్స్.. అదిరిపోయే యాక్టింగ్‌తో తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని దూసుకుపోతున్నాడు యంగ్ హీరో నాగశౌర్య. లవర్ బాయ్ ఇమేజ్‌తో కెరీర్‌ను ఆరంభించిన అతడు.. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడు. ఇలా 'ఊహలు గుసగుసలాడే' నుంచి చాలా తక్కువ సమయంలోనే ఇరవై సినిమాలను పూర్తి చేసుకున్నాడు. 'ఛలో' నుంచి పంథాను మార్చుకున్న అతడు.. కథలను రాయడంతో పాటు నిర్మాతగానూ మారాడు. ప్రస్తుతం అతడు నటిస్తోన్న సినిమాల్లో 'లక్ష్య' ఒకటి. తాజాగా దీని నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది.
భారత చలన చిత్ర చరిత్రలోనే ఆర్చరీ నేపథ్యంతో రూపొందుతోన్న మొట్టమొదటి చిత్రమే 'లక్ష్య'. ధర్రేంద్ర సంతోష్ జాగర్లపూడి తెరకెక్కిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తైంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను సైతం ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే దీని నుంచి ప్రతి శుక్రవారం ఓ అప్‌డేట్ వచ్చే విధంగా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రకటనను చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. ఈ మేరకు #LAKSHYASFRIDAY హ్యాష్ ట్యాగ్‌తో అప్‌డేట్లను ఇస్తామని తెలిపారు. ఈ తరహాలో ప్రమోషన్ కార్యక్రమాలను చేయడం ఇదే మొదటిసారి.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'లక్ష్య' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఇక, ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలతో పాటు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతికా శర్మ హీరోయిన్‌గా చేస్తోంది. ఇందులో నాగశౌర్య ఆర్చరీ ఆటగాడిగా కనిపించనున్నాడు. ఇందుకోసం అతడు ఏకంగా 8 పలకల దేహాన్ని సంపాదించుకున్నాడు. ఇక, ఇందులో జగపతి బాబు కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











